You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రయానం కోసం అతిపెద్ద రాకెట్ తయారీ.. భారీ బూస్టర్‌ను టెస్ట్ చేసిన నాసా
అమెరికా 2024లో మళ్లీ చంద్రుడి మీదకు మనుషులను పంపటం కోసం నాసా ఓ భారీ రాకెట్‌ను సిద్ధం చేస్తోంది.
1960లో తయారుచేసిన సాటర్న్ 5 తర్వాత అతిపెద్ద రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) రాకెట్ కోసం ఈ బూస్టర్‌ను నాసా పరీక్షించింది.
దీని పొడవు 54 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. ప్రపంచంలో ఇప్పటివరకూ తయారుచేసిన రాకెట్ బూస్టర్లన్నిటిలోకీ ఇదే అతి పొడవైనది, అత్యంత శక్తివంతమైనది.
ఇది సెకనుకు దాదాపు ఆరు టన్నుల ఇంధనాన్ని మండిస్తుంది. నాలుగు ఇంజన్లు గల జంబో జెట్ విమానాలు 14 కలిపి ఉత్పత్తి చేసే పీడనం కన్నా ఎక్కువ పీడనాన్ని పుట్టిస్తుంది.
బూస్టర్ రాకెట్ మోటార్ పనితీరును, నాణ్యతను పరిశీలించటానికి బుధవారం యూటా రాష్ట్రంలోని ప్రోమాన్టోరీలో ఈ టెస్ట్ నిర్వహించింది. ఇది రెండు నిమిషాల పాటు భారీ అగ్నికీలలు వెదజిమ్మింది.
ఎస్‌ఎల్ఎస్ రాకెట్‌లో ఇటువంటి బూస్టర్లు రెండిటిని ఉపయోగిస్తారు. రాకెట్ ప్రయోగించినపుడు అది అంతరిక్షంలోకి ప్రయాణించటానికి అవసరమైన పీడనాన్ని ఈ బూస్టర్లు మొదటి రెండు నిమిషాల్లో అందిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- లాక్డౌన్ ఎఫెక్ట్: ఏపీలో ప్రజలకు కరెంటు బిల్లుల షాక్... అదనపు భారం వేయలేదంటున్న ప్రభుత్వం
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)