చంద్రయానం కోసం అతిపెద్ద రాకెట్ తయారీ.. భారీ బూస్టర్‌‌ను టెస్ట్ చేసిన నాసా

వీడియో క్యాప్షన్, నాసా
ప్రచురణ

అమెరికా 2024లో మళ్లీ చంద్రుడి మీదకు మనుషులను పంపటం కోసం నాసా ఓ భారీ రాకెట్‌ను సిద్ధం చేస్తోంది.

1960లో తయారుచేసిన సాటర్న్ 5 తర్వాత అతిపెద్ద రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) రాకెట్‌ కోసం ఈ బూస్టర్‌ను నాసా పరీక్షించింది.

దీని పొడవు 54 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. ప్రపంచంలో ఇప్పటివరకూ తయారుచేసిన రాకెట్ బూస్టర్లన్నిటిలోకీ ఇదే అతి పొడవైనది, అత్యంత శక్తివంతమైనది.

ఇది సెకనుకు దాదాపు ఆరు టన్నుల ఇంధనాన్ని మండిస్తుంది. నాలుగు ఇంజన్లు గల జంబో జెట్ విమానాలు 14 కలిపి ఉత్పత్తి చేసే పీడనం కన్నా ఎక్కువ పీడనాన్ని పుట్టిస్తుంది.

బూస్టర్ రాకెట్ మోటార్ పనితీరును, నాణ్యతను పరిశీలించటానికి బుధవారం యూటా రాష్ట్రంలోని ప్రోమాన్టోరీలో ఈ టెస్ట్ నిర్వహించింది. ఇది రెండు నిమిషాల పాటు భారీ అగ్నికీలలు వెదజిమ్మింది.

ఎస్‌ఎల్ఎస్ రాకెట్‌లో ఇటువంటి బూస్టర్లు రెండిటిని ఉపయోగిస్తారు. రాకెట్ ప్రయోగించినపుడు అది అంతరిక్షంలోకి ప్రయాణించటానికి అవసరమైన పీడనాన్ని ఈ బూస్టర్లు మొదటి రెండు నిమిషాల్లో అందిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)