You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేటీ పెర్రీ, బ్రిటిష్ నటుడు ఆర్లాండో బ్లూమ్ జంటకు కూతురు పుట్టింది
అమెరికన్ గాయిని కేటీ పెర్రీ, బ్రిటిష్ నటుడు ఆర్లాండో బ్లూమ్ తమ తొలి బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. తమ కూతురికి డేసీ డవ్ బ్లూమ్ అని పేరు పెట్టారు.
అంతర్జాతీయ బాలల సహాయ సంస్థ యూనిసెఫ్‌కు వీరిద్దరూ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరు బిడ్డకు జన్మినిచ్చిన విషయాన్ని యూనిసెఫ్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ఆరోగ్యంగా, సురక్షితంగా పుట్టిన బిడ్డను చూసి ప్రేమాశ్చర్యాలతో పొంగిపోతున్నామని వారు ఈ ప్రకటనలో తెలిపారు.
పెర్రీ, బ్లూమ్ కలిసి చిన్నారి చేతిని పట్టుకున్న బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని విడుదల చేశారు.
ఈ సంవత్సరం మొదట్లో ‘సింగిల్ నెవెర్ వోర్న్ వైట్’ అనే వీడియో ఆల్బం రికార్డు చేస్తున్నప్పుడు పెర్రీ గర్భవతిగా ఉన్నట్లు తెలిపారు.
"మేము చాలా అదృష్టవంతులమని మాకు తెలుసు. మాకు జరిగినంత ప్రశాంతంగా అందరికీ ప్రసవ అనుభవం ఉండదని కూడా మాకు తెలుసు" అని వారు ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రపంచంలో అనేక చోట్ల వైద్య సిబ్బంది కొరత కారణంగా ప్రతి 11 సెకండ్లకి ఒక గర్భిణీ కానీ, శిశువు కానీ మరణిస్తున్నారు. వీటిని నివారించవచ్చని వారు అన్నారు.
“కోవిడ్ 19 ప్రబలినప్పటి నుంచి ఏర్పడిన నీరు, సబ్బు, వ్యాక్సిన్లు, మందుల కొరత వలన కొత్తగా జన్మించిన శిశువుల ప్రాణాలు మరింత ముప్పుని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి తండ్రులుగా ఆ బాధ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోగలం. ఇదంతా వింటున్నప్పుడు మా గుండెలు పగిలినట్లవుతుంది”, అని వారు విచారాన్ని వ్యక్తం చేశారు.
డేసీ జన్మించిన సందర్భంగా వారు విరాళాల సేకరణ కోసం ఒక పేజీని ప్రారంభించారు. ఇలా సేకరించిన విరాళాలను కొత్తగా తల్లులైనవారికి, పిల్లల సంక్షేమానికి ఖర్చు పెడతారు.
"మీ హృదయాలు కూడా దాతృత్వంతో వికసిస్తాయని ఆశిస్తున్నాం”, అని వారు ప్రకటనలో అన్నారు.
పెర్రీ ఈ నెల మొదట్లో ‘ స్మైల్’ అనే కొత్త ఆల్బం ని విడుదల చేశారు. “ఈ మహమ్మారి సమయంలో గర్భవతిగా ఉండడం భావోద్వాగాల ఊగిసలాటను అనుభవిస్తున్నట్లుగా ఉంది”, అని ఆ ఆల్బం లో ఆమె అన్నారు.
ఆమె గర్భంతో ఉన్నట్లు ఆమె ‘నెవెర్ వోర్న్ వైట్’ ఆల్బం విడుదల చేసినప్పుడు ప్రకటించారు. ఆ ఆల్బం లో చివరి నాలుగు నిమిషాలలో ఆమె గర్భంతో ఉన్నట్లు కనిపించేలా ఉంచారు.
ఆ పాటలో ఉన్న పదాలు ఆమె బ్లూమ్ ని త్వరలోనే వివాహం చేసుకోనున్నట్లు సందేశాన్నిచ్చాయి. వీరిద్దరికీ గత సంవత్సరం వాలెంటైన్ డే నాడు ఎంగేజ్మెంట్ అయింది.
పెర్రీ అంతకు ముందు రస్సెల్ బ్రాండ్ ని వివాహం చేసుకున్నారు. ఆమె 2008లో విడుదల చేసిన ‘కిస్సెడ్ ఎ గర్ల్’ అనే ఆల్బం ద్వారా పేరు గడించారు. ఇది యుకె లో నెంబర్ వన్ ఆల్బంగా పేరు పొందింది.
ఆ తరువాత ‘రోర్’, ‘కాలిఫోర్నియా కర్ల్స్’, ‘ఫైర్ వర్క్,’ ‘ నెవెర్ రియల్లీ ఓవర్’ లాంటి ఆల్బంలు హిట్లుగా మారాయి.
బ్లూమ్ అంతకు ముందు ఆస్ట్రేలియా మోడల్ మిరాండా కెర్ ని వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ 9 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నారు.
బ్లూమ్ ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘ది హొబ్బిట్’ సినిమాలలో నటించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- శ్రీశైలం పవర్ ప్లాంట్: భారీగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనే ప్రమాదం?
- కరోనావైరస్: ఈ పది దేశాల్లో ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదుకాలేదు
- హైదరాబాద్‌లో 6 లక్షల మందికి కరోనా సోకిందని సీసీఎంబీ అంచనా
- జీతాల డబ్బు తీసుకెళ్తున్న విమానం కూలి 8 మంది మృతి
- సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతారని సీడబ్ల్యూసీ నిర్ణయం
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- టీవీ షోలో బంగారం వేట.. గంటల్లోనే రెండు కోట్ల విలువైన బంగారం దొరికింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.).