వైరల్ వీడియో: కరోనావైరస్ పుట్టిల్లు వూహాన్‌ నగరంలో అంబరాన్నంటుతున్న సంబరాలు

ప్రచురణ

వేలమంది ఒక్కచోట గుమిగూడారు. వాళ్ల ముఖాలకు మాస్కులు కూడా కనిపించడం లేదు. రబ్బరు ట్యూబులను ధరించి, భుజంభుజం కలిపి ఓ వాటర్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. ఇది 2020లో కనిపించాల్సిన దృశ్యం కాదు. ఎందుకంటే ఈ ఉత్సవం జరుగుతున్నది ఎక్కడో కాదు. కోవిడ్‌-19కు పుట్టినిల్లయిన చైనాలోని వూహాన్‌ నగరంలో.

వూహాన్‌లోని మయా వాటర్‌పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కోవిడ్‌-19 వైరస్‌ గురించి ఏమాత్రం భయపడుతున్నట్లు కనిపించ లేదు. ప్రపంచం వైరస్‌తో పోరాడుతున్న సమయంలో ఈ వీడియో వైరల్‌ అయ్యింది.

ఏప్రిల్‌లో అక్కడ లాక్‌డౌన్‌ను ఎత్తేశారు. మే నెల నుంచి వూహాన్‌లోగానీ, ఈ నగరం ఉన్న హుబే ప్రావిన్స్‌లోగానీ ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)