బ్రెజిల్‌‌లో మహమ్మారి విలయం: లక్ష దాటిన కరోనా మరణాలు

ప్రచురణ

బ్రెజిల్‌లో కరోనా పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. కేసుల సంఖ్య 30 లక్షలు దాటగా మరణాల సంఖ్య లక్ష దాటాయి. లాటిన్ అమెరికాలో మొత్తం కేసులు 50 లక్షలకుపైనే ఉన్నాయి. పురిటి బిడ్డలు సైతం కరోనా సోకి చనిపోతున్న దుస్థితి బ్రెజిల్‌లో కనిపిస్తోంది. బీబీసీ ప్రతినిధి కేటీ వాట్సన్ అందిస్తున్న కథనం.

సావ్ పావ్లోలోని ఈ ఆసుపత్రిలో రోజుకు రెండు సార్లు కరోనా పేషెంట్ల సమాచారం వెల్లడి చేస్తారు.

లోపల చికిత్స పొందుతున్న తమ వాళ్ల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు వారి బంధువులకున్న ఏకైక మార్గం ఇదే.

పేదరికంతో కునారిల్లుతున్న తూర్పు సావ్ పావ్లో ప్రాంతంలో అత్యధిక మరణాలు రికార్డవుతున్నాయి. బ్రెజిల్‌లో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్నది ఇక్కడే.

బతుకు పోరాటంలో కరోనాకు మరో శత్రువు తోడైంది. ఆర్థికసంక్షోభం వల్ల ఇప్పటికే లక్షల మందికి ఉద్యోగాలు పోగా పేదల పరిస్థితి దయనీయంగా మారింది.

కరోనా ఎక్కడా ఆగడం లేదు. బ్రెజిల్ నుంచి కొలంబియా, పెరూ నుంచి మెక్సికో వరకు.. లాటిన్ అమెరికా ప్రాంతమంతటా 50 లక్షలకుపైగా కేసులున్నాయి. బ్రెజిల్‌లో మాత్రం పరిస్థితి చాలా భయానకంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)