బ్రెజిల్‌లో మహమ్మారి విలయం: లక్ష దాటిన కరోనా మరణాలు
బ్రెజిల్‌లో కరోనా పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. కేసుల సంఖ్య 30 లక్షలు దాటగా మరణాల సంఖ్య లక్ష దాటాయి. లాటిన్ అమెరికాలో మొత్తం కేసులు 50 లక్షలకుపైనే ఉన్నాయి. పురిటి బిడ్డలు సైతం కరోనా సోకి చనిపోతున్న దుస్థితి బ్రెజిల్‌లో కనిపిస్తోంది. బీబీసీ ప్రతినిధి కేటీ వాట్సన్ అందిస్తున్న కథనం.
సావ్ పావ్లోలోని ఈ ఆసుపత్రిలో రోజుకు రెండు సార్లు కరోనా పేషెంట్ల సమాచారం వెల్లడి చేస్తారు.
లోపల చికిత్స పొందుతున్న తమ వాళ్ల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు వారి బంధువులకున్న ఏకైక మార్గం ఇదే.
పేదరికంతో కునారిల్లుతున్న తూర్పు సావ్ పావ్లో ప్రాంతంలో అత్యధిక మరణాలు రికార్డవుతున్నాయి. బ్రెజిల్‌లో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్నది ఇక్కడే.
బతుకు పోరాటంలో కరోనాకు మరో శత్రువు తోడైంది. ఆర్థికసంక్షోభం వల్ల ఇప్పటికే లక్షల మందికి ఉద్యోగాలు పోగా పేదల పరిస్థితి దయనీయంగా మారింది.
కరోనా ఎక్కడా ఆగడం లేదు. బ్రెజిల్ నుంచి కొలంబియా, పెరూ నుంచి మెక్సికో వరకు.. లాటిన్ అమెరికా ప్రాంతమంతటా 50 లక్షలకుపైగా కేసులున్నాయి. బ్రెజిల్‌లో మాత్రం పరిస్థితి చాలా భయానకంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- గౌతమ బుద్ధుడు భారతీయుడు ఎలా అయ్యారు? - భారత్‌ను ప్రశ్నించిన నేపాల్
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- చైనాలోని వీగర్ ముస్లింల సమస్యలపై ప్రపంచ దేశాలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?
- ’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- LAC వద్ద చలికాలంలో పహరా కాసేందుకు భారత సైన్యం ఎలా సిద్ధమవుతోంది?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో రియా చక్రవర్తి ఎందుకు విలన్ అయ్యారు?
- అమ్మోనియం నైట్రేట్: విశాఖ రేవుకు జోరుగా దిగుమతులు, విజయవాడలో భారీ నిల్వలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)