దుబాయ్: కరోనా కష్టాలు ముగిసినట్టేనా?

ప్రచురణ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.

కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందుకే యూఏఈలో లాక్‌డౌన్‌ను తొలగించారు.

కార్యాలయాలు, సినిమాహాళ్లు, మాల్స్, విమానాశ్రయాలతో పాటు పర్యటక కేంద్రాలను కూడా తెరిచారు.

కరోనాను నియంత్రించేందుకు దుబయ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది.

అందులో ఒకటి కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ అల్‌హోస్న్.

యూఏఈకు వచ్చేవారందరూ ఈ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.

జూలై 7 నుంచి పర్యటకులకు అనుమతినిచ్చింది దుబాయ్.

వరల్డ్ టూరిజం అండ్ కౌన్సిల్ దుబయ్‌కి గ్లోబల్ సేఫ్టీ అండ్ హైజీన్ స్టాంప్‌ కూడా ఇచ్చింది.

దుబయ్ కోల్పోయిన తన ప్రాభవాన్ని పూర్తి స్థాయిలో ఎప్పుడు సాధించగలుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)