సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు విజయం సాధించటం ఎలా?: దిల్లీ ‘శ్రీరామ్స్ ఐఏఎస్’ డైరెక్టర్ శ్రీరంగం శ్రీరామ్‌తో ఇంటర్వ్యూ

ప్రచురణ

సివిల్ స‌ర్వీసెస్‌పై యువతలో ముఖ్యంగా విద్యార్థి దశలో ఎంతో ఆసక్తి ఉంటుంది. అదే దశలో ప్రిపరేషన్ ప్రారంభించేవారూ ఉంటారు.

మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని యువతీయువకులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కావాలంటే ఏం చేయాలి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటా మూడు దశల్లో నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి?

సివిల్స్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంలో సుదీర్ఘ అనుభవమున్న దిల్లీలోని శ్రీరామ్స్ ఐఏఎస్ సంస్థ డైరెక్టర్ శ్రీరంగం శ్రీరామ్, ఇలాంటి వివిధ ప్రశ్నలకు బీబీసీకి ఇచ్చిన ఈ వీడియో ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చారు. యావరేజ్ స్టూడెంట్స్ విజయం సాధించాలంటే ఎలా సన్నద్దం కావాలో శ్రీరామ్ వివరించారు.

సివిల్స్ ఇంటర్వ్యూలో అభ్యర్థుల భాషా నేపథ్యం, ఉత్తరాది, లేదా దక్షిణాది నేపథ్యం ప్రభావం చూపిస్తాయా, సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం కావడంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు విద్యార్థులకు ప్రయోజనకరమేనా, కాదా, టాపర్లలో సైన్స్, ఇంజినీరింగ్ చదివినవారు ఎక్కువ మంది ఎందుకుంటారు, సివిల్స్‌లో మహిళలు- ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల ప్రాతినిధ్యం ఎలా ఉంది, పోస్టుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది, పోస్టుల భర్తీ విషయంలో యూపీఏ, ఎన్డీఏ విధానాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? - అనే అంశాలపై ఆయన స్పందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)