You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నాసా ప్రధాన కేంద్రానికి నల్ల జాతి ఇంజనీర్ మేరీ జాక్సన్ పేరు
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్న నాసా ప్రధాన కేంద్రానికి అక్కడ పని చేసిన తొలి నల్ల జాతి ఇంజనీర్ మేరీ జాక్సన్ పేరు పెట్టాలని నిర్ణయించారు.
ఆఫ్రికన్ అమెరికన్లకు, ముఖ్యంగా మహిళలకు ఇంజనీరింగ్ టెక్నాలజీ రంగాలలోకి ప్రవేశించడానికి ఉన్న అవాంతరాలను జాక్సన్ సుగమం చేశారని నాసా అధికారి జిమ్ బ్రిడెన్‌స్టైన్ చెప్పారు.
2016 లో విడుదలైన హిడెన్ ఫిగర్స్ అనే చిత్రంలో మేరీ జాక్సన్ కథను చూపించారు. ఆమె వర్జీనియా లోని హాంప్టన్ లో జన్మించారు. 2005 లో ఆమె మరణించారు.
గత సంవత్సరం నాసా ప్రధాన కార్యాలయం ఉన్న వీధిని ‘హిడెన్ ఫిగర్స్ వే’ గా పేరు మార్చారు.
ఇక పై నాసా విజయానికి తోడ్పడిన మహిళల పాత్రని ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్లు, వివిధ వర్గాలకు చెందినవారు నాసాకి అందించిన సేవలను గుర్తిస్తామని బ్రిడెన్‌స్టైన్ ఒక ప్రకటనలో తెలిపారు.
అమెరికన్ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళడానికి ప్రముఖ పాత్ర పోషించిన మహిళా సభ్యల బృందంలో మేరీ జాక్సన్ ఒకరని ఆ ప్రకటనలో రాశారు.
"మహిళలకి ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాలలో ప్రవేశించడానికున్న అవాంతరాలను ఆమె చేధించారు”.
ఆఫ్రికన్ అమెరికన్లు అమెరికా చేతిలో వివక్షకు గురయ్యారని దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సమయంలో ఈ పేరు మార్చే నిర్ణయం రావడం విశేషం.
పోలీసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన జార్జి ప్లాయిడ్ మరణం తర్వాత అమెరికా వ్యాప్తంగా జాతి వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు చోటు చేసుకున్నాయి.
నాసా మేరీ జాక్సన్ ని గౌరవించడం పట్ల ఆమె కుమార్తె కారోలిన్ లూయిస్ హర్షం వ్యక్తం చేశారు.
"ఆమె ఒక శాస్త్రవేత్త, మానవతా వాది , మంచి భార్య, తల్లి , మరెంతో మంది నాసాలో అడుగు పెట్టడానికి మార్గం చూపిన వ్యక్తని”, ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా వీసాలు.. విశేషాలు
- రూ.50,000కి చేరిన బంగారం ధర.. ఇప్పుడు కొంటే లాభమా.. అమ్మితే మంచిదా
- ప్రభుత్వ స్టేట్ హోంలో 57 మంది బాలికలకు కరోనావైరస్... పరీక్షల్లో ఏడుగురు గర్భవతులని వెల్లడి
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఎందుకు ఇవ్వట్లేదు?
- రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?
- ముంబయిలోని మురికివాడ ధారావిలో కరోనాను ఎలా కంట్రోల్ చేశారు
- టిబెట్‌ను చైనా ఎప్పుడు, ఎలా తన ఆధీనంలోకి తీసుకుంది?
- భారత్, చైనా ఘర్షణల తరువాత లేహ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)