You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హాంకాంగ్: ఆందోళనకారులపై బాష్పవాయువు, నీటి ఫిరంగులను ప్రయోగించిన పోలీసులు
హాంకాంగ్‌లో ప్రదర్శన సాగుతుండగా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
ఇప్పటివరకూ దాదాపు 120 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
చైనా ప్రణాళికను విమర్శిస్తూ ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 200 మంది సీనియర్ రాజకీయవేత్తలు సంయుక్త ప్రకటన జారీచేశారు.
''ఇది హాంగ్ కాంగ్ నగర స్వయంప్రతిపత్తి మీద, చట్టం మీద, ప్రాథమిక స్వాతంత్ర్యాల మీద మూకుమ్మడి దాడి'' అని వారు అభివర్ణించారు.
''ఆ చట్టం అమలైతే కేవలం మాట్లాడటమే నేరంగా మారిపోవచ్చు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిని శిక్షించవచ్చు'' అని 25 ఏళ్ల విన్సెంట్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ప్రతిపాదిత చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం నిరసనకారులు నగరంలో రద్దీగా ఉండే కాస్‌వే బే, వాన్ చాయ్ ప్రాంతాల్లో గుమిగూడారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఫేస్ మాస్కులు ధరించిన నిరసనకారుల మీద పోలీసులు టియర్ గ్యాస్, నీటి ఫిరంగులు ప్రయోగించారు. సామాజిక దూరం అమలు చేయటం కోసం పెద్ద బహిరంగ సమావేశాల మీద నిషేధం ఉన్నప్పటికీ.. అనుమతి లేకుండా ఎవరూ సమావేశం జరపటానికి వీల్లేదని అధికారులు హెచ్చరించినప్పటికీ ప్రజలు వేల సంఖ్యలో గుమిగూడి నిరసన ప్రదర్శన చేపట్టారు. కొందరు నిరసనకారులు పోలీసు సిబ్బంది మీద గొడుగులు, వాటర్ బాళిళ్లు వంటి వస్తువులను విసిరారు.
సోలీసులు ముందుకు రాకుండా రోడ్లను దిగ్బంధించటానికి చెత్త డబ్బాలు, ఇతర చెత్తను అడ్డుగావేశారు. ఆదివారం నాటి నిరసన ప్రదర్శన క్రమం.. గత ఏడాది హింసాత్మకంగా మారిన నిరసన ప్రదర్శనల తరహాలోనే సాగిందని కొన్ని వార్తలు చెప్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- 'కరోనావైరస్ ప్రభావంతో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది... రుణాలపై ఆగస్ట్ 31 వరకూ మారటోరియం' - ఆర్బీఐ గవర్నర్
- దిల్లీ - హైదరాబాద్/వైజాగ్ విమాన ప్రయాణం ఛార్జీ కనిష్ఠం రూ.3,500, గరిష్ఠం రూ.10 వేలు
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
- కరోనా లాక్డౌన్: 200 ప్రత్యేక రైళ్లకు నేటి నుంచి బుకింగ్ ప్రారంభం... తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే
- వీడియో, ఇండియా లాక్డౌన్: 18 నెలల శిశువుతో 2 వేల కి.మీ. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు
- చైనాతో సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది?
- సైక్లోన్ ఆంఫన్: కోల్‌కతాలో విలయం సృష్టించిన తుపాను
- టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి? వివాదం ఏంటి?
- కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు.. నాలుగు దేశాల్లోనే అత్యధికం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)