హాంకాంగ్‌: ఆందోళ‌న‌కారుల‌పై బాష్పవాయువు, నీటి ఫిరంగులను ప్రయోగించిన పోలీసులు

వీడియో క్యాప్షన్, హాంకాంగ్‌: ఆందోళ‌న‌కారుల‌పై బాష్పవాయువు, నీటి ఫిరంగులను ప్రయోగించిన పోలీసులు....
ప్రచురణ

హాంకాంగ్‌లో ప్రదర్శన సాగుతుండగా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.

ఇప్పటివరకూ దాదాపు 120 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

చైనా ప్రణాళికను విమర్శిస్తూ ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 200 మంది సీనియర్ రాజకీయవేత్తలు సంయుక్త ప్రకటన జారీచేశారు.

''ఇది హాంగ్ కాంగ్ నగర స్వయంప్రతిపత్తి మీద, చట్టం మీద, ప్రాథమిక స్వాతంత్ర్యాల మీద మూకుమ్మడి దాడి'' అని వారు అభివర్ణించారు.

''ఆ చట్టం అమలైతే కేవలం మాట్లాడటమే నేరంగా మారిపోవచ్చు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిని శిక్షించవచ్చు'' అని 25 ఏళ్ల విన్సెంట్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ప్రతిపాదిత చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం నిరసనకారులు నగరంలో రద్దీగా ఉండే కాస్‌వే బే, వాన్ చాయ్ ప్రాంతాల్లో గుమిగూడారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఫేస్ మాస్కులు ధరించిన నిరసనకారుల మీద పోలీసులు టియర్ గ్యాస్, నీటి ఫిరంగులు ప్రయోగించారు. సామాజిక దూరం అమలు చేయటం కోసం పెద్ద బహిరంగ సమావేశాల మీద నిషేధం ఉన్నప్పటికీ.. అనుమతి లేకుండా ఎవరూ సమావేశం జరపటానికి వీల్లేదని అధికారులు హెచ్చరించినప్పటికీ ప్రజలు వేల సంఖ్యలో గుమిగూడి నిరసన ప్రదర్శన చేపట్టారు. కొందరు నిరసనకారులు పోలీసు సిబ్బంది మీద గొడుగులు, వాటర్ బాళిళ్లు వంటి వస్తువులను విసిరారు.

సోలీసులు ముందుకు రాకుండా రోడ్లను దిగ్బంధించటానికి చెత్త డబ్బాలు, ఇతర చెత్తను అడ్డుగావేశారు. ఆదివారం నాటి నిరసన ప్రదర్శన క్రమం.. గత ఏడాది హింసాత్మకంగా మారిన నిరసన ప్రదర్శనల తరహాలోనే సాగిందని కొన్ని వార్తలు చెప్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)