రెండు బుల్లెట్లు తగిలినా, ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి

ప్రచురణ

ఈ పసిబిడ్డ ఒంట్లోకి రెండు బులెట్లు దిగాయి. అప్పుడే పుట్టిన ఆ బిడ్డ పేరు అమీనా. కాబూల్ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డుపై మిలిటెంట్లు దాడి చేసి మారణహోమం సృష్టించినప్పుడు ఆ శిశువు కాలిలోకి రెండు బులెట్లు దిగబడ్డాయి.

ఆ దాడిని పాప తండ్రి రఫీవుల్లా కళ్ళారా చూశారు. "లోపలికి వెళ్ళగానే కారిడార్‌లో జనం అంతా కిందపడి ఉండడం చూశాను. ఓ వృద్ధ మహిళపై కూడా కాల్పులు జరిపారు. ప్రసూతి వార్డులో నా భార్య కుప్పకూలిపోయి ఉంది. ఆమె గుండెలో, కాలి మీద కాల్పులు జరిపారు. ఆమె చేతులు బిడ్డను ఎత్తుకున్నట్లే ఉన్నాయి" అని రఫీవుల్లా చెప్పారు.

ఆ దాడిలో అమీనా తల్లితో పాటు 16 మంది అమ్మలు చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)