వీడియో: న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ‘గల్లంతైనవారు బతికే ఉన్నారనేందుకు ఎలాంటి సంకేతాలు లేవు’

ప్రచురణ

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం ఘటనలో ఐదుగురు మృతిచెందగా, మిగతావారి ఆచూకీ తెలియలేదు. తాజా సమాచారం ప్రకారం గల్లంతైనవారు బతికే ఉన్నారనేందుకు ఎలాంటి సంకేతాలు లభించట్లేదని ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెన్ అన్నారు.

34 మంది ప్రాణాలతో బయటపడగా, అందులో 13 మంది ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసింది. ఈ 13 మందిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు అని ఖచ్చితంగా తెలిసింది. మిగిలిన ఎనిమిది మంది ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)