You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తల్లికి దూరమైన ఒక చిరుత పిల్ల.. మళ్లీ తన తల్లి దగ్గరికి ఎలా చేరిందంటే..
ముంబయిలోని సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనంలో తల్లికి దూరమైన ఒక చిరుత పిల్లను అటవీ శాఖ అధికారులు తిరిగి తల్లి చెంతకు చేర్చారు.
అక్టోబర్ 10న ఉదయం గోరేగావ్ ఫిల్మ్ సిటీ దగ్గర ఒక నాలుగు వారాల వయసున్న చిరుతపులి పిల్లను చూసి కుక్కలు మొరగడం స్థానికులు చూశారు.
అక్కడున్న ఒక సెక్యూరిటీ గార్డ్ కుక్కల నుంచి ఆ చిరుత పిల్లను కాపాడి, అటవీ అధికారులకు అప్పగించాడు.
అదే రోజు రాత్రి ఆ పిల్లను తల్లి దగ్గరకు చేర్చాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
దీంతో, అక్టోబర్ 12న ఉదయం అటవీ శాఖ అధికారులు ఆ పిల్లను తల్లి దగ్గరికి తీసుకొచ్చారు.
బోనులో ఉన్న తన పిల్లను తల్లి గుర్తించింది.
బయటికి వచ్చిన పిల్లను చిరుతను తనతో తీసుకెళ్లింది.
ఇవి కూడా చదవండి:
- హిందీ మీడియంలో ఎంబీబీఎస్ కోర్సు... దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
- 530 కోట్ల మొబైల్ ఫోన్లు పారేయాల్సిందే, ఈ ఏడాదే..
- షీ జిన్పింగ్: చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని ఎలా నియంత్రిస్తున్నారు? ‘ప్రశ్నించడానికి వీలులేని అధికారాన్ని’ ఎలా సొంతం చేసుకున్నారు?
- క్యాసినో అంటే ఏంటి, అందులో ఏం చేస్తారు... చట్టాలు ఏం చెబుతున్నాయి?
- అందం కోసం వాడే క్రీములతో అనర్థాలెన్నో
- ‘‘అందం అంటే తెల్లగా కనిపించడం’ అనే భావనను తొలగించడం కోసం నేను ఇంకా కష్టపడుతున్నా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)