గుజరాత్ గ్రామీణ మహిళ జీవితాలను మార్చేస్తున్న మెన్‌స్ట్రువల్ కప్స్

ప్రచురణ

గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో కాత్యాయనీ తివారి అనే మహిళ గ్రామీణ మహిళలకు మెనుస్ట్రువల్ కప్స్‌పై అవగాహన కల్పిస్తూ వారి జీవితాలలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

పీరియడ్స్ సమయంలో మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారని, వారిని ఈ సమస్య నుంచి బయటపడేయడానికే తాను ఈ కప్స్ గురించి ప్రచారం చేస్తున్నానని కాత్యాయనీ తివారీ అంటున్నారు.

ఈ కప్స్ ఉపయోగించడం చాలా సులభమంటూ వాటిని ఉపయోగించే తీరును వారికి వివరిస్తున్నారు.

వీటిని ఉపయోగించడం వల్ల పీరియడ్స్ సమయంలో ఎలాంటి సమస్యలు రావని ఆమె వారికి చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)