సెరిబ్రల్ పాల్సీతో బాధ పడుతున్న వందన... అమితాబ్‌ బచ్చన్‌కు ఎన్నో లేఖరు రాశారు, ఆయన కొన్నింటికి బదులిచ్చారు

ప్రచురణ

సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతూనే బతుకుదెరువు కోసం జిరాక్స్ షాప్ నడుపుతోంది వందన కటారియా.

నాకు ఇబ్బందిగా ఉన్నా నిదానంగా నా పనులు చేసుకుంటాను. నేను వేగంగా ముందుకు సాగలేకపోవచ్చు కానీ సొంతకాలిపై నిలబడాలని ప్రయత్నిస్తాను అంటూ ఆత్మస్థైర్యంతో జీవిస్తున్నారు వందన. జెట్పూర్ కి చెందిన వందన కటారియా సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్నారు.

జీవితంలో కష్టాలకు దాసోహం అనకుండా ఎదురించి పోరాడాలని నమ్మే వ్యక్తి వందన కటారియా. పుట్టుకతోనే ఆమెకు సెరిబ్రల్ పాల్సీ ఉంది. ఈ వ్యాధితో బాధపడే వారికి శరీరంపై పట్టు ఉండదు. ఈ వ్యాధికి చికిత్స కూడా లేదు.

ఎన్ని శారీరక ఇబ్బందులున్నా సరే వందన ఎప్పుడూ నిరాశపడలేదు. రోజంతా చురుకుగా తన పనులు తాను చేసుకుంటారు. జీవితం పట్ల ఆసక్తిని ఆమె ఎన్నడూ వీడలేదు. పీజీడీసీఏ పూర్తిచేసిన వందన ఒంటరిగానే జీవిస్తున్నారు. బతుకుదెరువు కోసం ఆమె జిరాక్స్ షాపు నడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)