Swathi Krishnan: బిజినెస్‌లో నష్టం వచ్చింది, రిలేషన్‌షిప్ విఫలమైంది.. కరళకట్టైలో సక్సెస్ దొరికింది
ఈమె పేరు స్వాతి కృష్ణన్. తమిళ్ మాట్లాడే ఇంటర్నేషనల్ కరళకట్టై కోచ్.
2020 నుంచి కరళకట్టైను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ వ్యాయామంతో ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలియడంతో సాధన చేయడం ప్రారంభించానని చెబుతున్నారు.
పురుషులు ఎక్కువగా సాధన చేసే ఈ వ్యాయామంలో తొలి ఇంటర్నేషనల్ కోచ్ తానేనని చెబుతున్న స్వాతి కృష్ణన్ ఏమంటున్నారో ఆమె మాటల్లోనే..
''దీనిలో తొలి లెవల్‌ను మెయి పాడమ్ అంటారు. మొదటి లెవల్ తర్వాత ఆగస్టు 2021లో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాను.
జనవరి 2022లో నేను తొలి లెవల్ కరళకట్టై కోచ్‌ను అయ్యాను. సత్యమంగళం అనే చిన్న పట్టణం నుంచి నేను వచ్చాను.
అలాంటి చిన్న ఊరు నుంచి వచ్చే వారు బాగా చదువుకొని, మంచి ఉద్యోగం చేయాలని కలలు కంటారు. నేను కూడా అలానే కలలు కన్నాను.
బిజినెస్ మొదలుపెట్టినప్పుడు అందరూ మానసిక ఆరోగ్యం గురించే మాట్లాడేవారు. శారీరక ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకునేవారు కాదు.
నా దృష్టి కూడా మానసిక ఆరోగ్యంపైనే ఉండేది. అయితే, దీని వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. 2019లో నా బిజినెస్‌లో నష్టాలు వచ్చాయి. దివాలా తీశాను. నా రిలేషన్‌షిప్, ఫ్రెండ్‌షిప్‌లు కూడా విఫలం అయ్యాయి.
అన్ని వైపుల నుంచీ అపజయాలు ఎదురైనప్పుడు నేను కరళకట్టై మొదలుపెట్టాను. ప్రపంచం మొత్తం వెతికిన తర్వాత, తమిళ సంప్రదాయ కరళకట్టై నాకు ఉపశమనం కల్పించింది.
నా విద్యార్థులంతా నడివయసు వారే. వారిలో చాలా మంది కార్పేరేట్ ఉద్యోగులే ఉంటారు. వారు ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తారు.
ఇంకా ఎంట్రపెన్యూర్స్ కూడా వస్తారు. వారికి టైమ్ చాలా తక్కువగా ఉంటుంది.
ఇలా విరామం లేకుండా తిరిగే ప్రజలను ఆపడమే నా పని. కనీసం ఒక గంటైనా వారితో కరళకట్టై ప్రాక్టీస్ చేయిస్తుంటాను.
దీనితో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను చూస్తే.. గురక తగ్గుతుంది. మానసిక, శారీరక ఒత్తిడి కూడా తొలగిపోతుంది.
గతానికి సంబంధించి బాధాకరమైన జ్ఞాపకాల నుంచి విముక్తి లభిస్తుంది.
రుతుక్రమానికి సంబంధించి సమస్యలు కూడా తగ్గుతాయి. నాకు ఇలానే జరిగింది.
అజీర్ణ సమస్య కూడా తొలగిపోతుంది.
దీనితో చాలా ప్రయోజనాలు ఉంటాయి'' అని చెప్పారు.
రెండుసార్లు సిజేరియన్..
స్వాతి కృష్ణన్ వద్ద శిక్షణ పొందుతున్న రతి అళగరాజ్ ఈ వ్యాయామం సాధన చేసిన తరువాత తన అనుభవాలను వివరించారు.
''మొదట్లో కరళకట్టై పేరు వినగానే.. ఇది పురుషుల కోసం కదా మనకెందుకు అనిపించింది. దీని గురించి మా కుటుంబ సభ్యులతో మాట్లాడాను.
ఇది సంప్రదాయ కళ అని తెలుసుకోవడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. దీనికి గురించి నా భర్త, ఇతర కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు.. ''కరళకట్టైని నువ్వు ఎలా ఎత్తుతావు?''అని వారు ప్రశ్నించారు.
రెండుసార్లు సీ-సెక్షన్ ఆపరేషన్ జరిగింది. అందుకే నేను బరువులు ఎత్తగలనా? ఒత్తిడి తీసుకోగలనా అని ఆలోచించాను.
అప్పుడే నేను స్వాతితో మాట్లాడాను. ట్రైనింగ్ రమ్మని ఆమె ఆహ్వానించారు.
దీంతో ట్రైనింగ్‌కు రోజూ వచ్చేదాన్ని. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒత్తిడి కూడా తొలగింది. ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నాను.
ఒకప్పుడు నాకు కాళ్ల నొప్పులు ఉండేవి. ఇప్పుడు పూర్తిగా తగ్గాయి.
ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను'' అని రతి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



