సనోఫర్ పఠాన్: ఆమె ఒక్కసారిగా శరీర బరువు పెరగడంతో తండ్రి రెజ్లింగ్‌లో చేర్చారు, కానీ

వీడియో క్యాప్షన్, ఆమె ఒక్కసారిగా శరీర బరువు పెరగడంతో తండ్రి రెజ్లింగ్‌లో చేర్చారు, కానీ
ప్రచురణ

రెజ్లర్ కావాలనే లక్ష్య సాధనలో అన్ని అడ్డంకుల్ని సనోఫర్ పఠాన్ అధిగమించారు.

సనోఫర్ ఈ స్థాయికి చేరుకోవడానికి అనేక సవాళ్లను ఎదుర్కొని వాటిని అధిగమించారు. కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. తన వయసున్న మిగతా రెజ్లర్లతో పోలిస్తే సనోఫర్ శారీరంగా చాలా దృఢంగా ఉన్నారని ఆమె కోచ్ చెప్పారు.

‘‘నేను కుస్తీ పోటీల్లో పాల్గొనడాన్ని మా బంధువులు వ్యతిరేకించారు. అప్పట్లో నేను యువతిని కావడంతో నాతో ఏమీ చెప్పకపోయినా, మా అమ్మానాన్నలతో చాలా విషయాలు చెప్పేవారు. ముస్లిం అమ్మాయిలు ఇలాంటి చిన్న దుస్తులు వేసుకోవడం మంచిది కాదని తరచూ నా తల్లిదండ్రులతో వాదించేవారు. మీ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారని అడిగేవారు’’అని ఆమె చెప్పారు.

సనోఫర్ చాలా రాష్ట్రస్థాయి ఛాంపియన్ షిప్ పోటీలతో పాటు ఖేలో ఇండియా, నేషనల్ సబ్ జూనియర్ స్థాయిలో అనేక బంగారు పతకాలు గెలిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)