దిల్లీలో అగ్నిప్రమాదం: ‘భర్త చనిపోయారు. ఇప్పుడు ఒక్కగానొక్క కూతురు ఏమైందో తెలియడం లేదు’

ప్రచురణ

పశ్చిమ దిల్లీ శివార్లలో ముండ్కాలోని ఒక వాణిజ్య భవనంలో శుక్రవారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27 మంది మరణించినట్లు నిర్ధారించారు.

ఆ నాలుగు అంతస్తుల భవనంలో బెస్‌మెంట్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆఫీసులు, దుకాణాలు ఉన్నాయి. పైన మూడు అంతస్తులలో సీసీటీవీ కెమేరాలు తయారుచేసే సంస్థ కార్యాలయం ఉంది.

ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది ఈ సంస్థ ఉద్యోగులే.

ఈ ప్రమాదంలో ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయారు. మరికొందరు తమ వారి జాడ తెలియక కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)