హనుమాన్ శోభయాత్రకు పూలతో స్వాగతం పలికిన ముస్లింలు

ప్రచురణ

ఏప్రిల్ 16న దేశంలోని వివిధ ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో భక్తులు ఊరేగింపు నిర్వహించారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తడం కనిపించింది. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో హిందూముస్లింల ఐక్యతను చాటే అందమైన దృశ్యం కనిపించింది. ఒక ప్రాంతం నుంచి హనుమాన్ శోభాయాత్ర వెళ్తున్నప్పుడు.. స్థానిక ముస్లింలు ఊరేగింపుపై పువ్వులు చల్లుతూ కనిపించారు. ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)