You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తిరుమల కొండపైకి ఆర్టీసీ బస్సు వెళ్తుండగా విరిగిపడిన కొండచరియలు.. డ్రైవరు అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
భారీ వర్షాలు కురుస్తుండడంతో తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి..
దీంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.
దీంతో అధికారులు రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టారు.
గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ల లో కొండ చరియలు విరిగిపడుతున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
బుధవారం తెల్లవారుజామున భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయని ఆయన చెప్పారు.
బుధవారం ఉదయం 5.45 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళ్తుండగా భారీ శబ్దం రావడంతో డ్రైవర్ బస్సు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చైర్మన్ చెప్పారు.
కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో మరో అయిదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించి.. వీలైనంత త్వరలో రోడ్డు మరమ్మతులు చేసి, రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మా దేశంపై ఆంక్షలు ఎత్తివేయండి - దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
- ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్ ఎవరు? ఆయన గురించి మాజీ సీఈవో ఏం చెప్పారు?
- ఒమిక్రాన్ కరోనా వేరియంట్ లక్షణాలేంటి? దీన్ని మొదట గుర్తించిన దక్షిణాఫ్రికా డాక్టర్ ఏం చెప్పారు?
- భారత్-చైనా: సరిహద్దుల్లో ఘర్షణలున్నా క్రీడల కోసం ఎందుకు చేతులు కలిపాయి?
- యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు - సీఎం కేసీఆర్ ప్రకటన
- షారుక్ ఖాన్ను మహిళలు ఎందుకు ఇష్టపడతారు?
- ఆంధ్రప్రదేశ్లో చెరకు ఫ్యాక్టరీలు రైతులకు బకాయిలు ఎందుకు చెల్లించట్లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)