గుజరాత్: ఈత కొట్టగల అరుదైన ఒంటెల జాతి ఇదే..

వీడియో క్యాప్షన్, గుజరాత్: ఈత కొట్టగల ఈ అరుదైన ఒంటెల జాతి ఇదే..
ప్రచురణ

గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో కనిపించే అరుదైన ఖరాయ్ ఒంటెలు నీటిలో ఈదుతాయి.

కానీ ఇప్పుడివి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.

ఈ ఒంటెలు మేత మేసే నేలలను.. వేగంగా విస్తరిస్తున్న ఉప్పు పరిశ్రమ మింగేస్తోంది.

దీంతో వీటి పెంపకంపై జీవించేవారు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.

ఆ ప్రాంతంలోని ఎన్నో ఉప్పు కయ్యలు అక్రమమని వారు ఆరోపిస్తున్నారు.

స్థానిక పోర్టు అధికారులు మాత్రం వాటి గురించి తమకు తెలీదని చెబుతున్నారు.

ప్రభుత్వం, స్థానిక స్వచ్ఛంద సంస్థలు ఈ అరుదైన జాతి ఒంటెలను కాపాడేందుకు కష్టపడుతున్నాయి.

కానీ ఈ ప్రయత్నాలు సరిపోతాయా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)