కత్తి మహేష్ మృతి

ప్రచురణ

కత్తి మహేష్ ఇక లేరు. సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ గత నెల 26న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం, చంద్రశేఖరపురం సమీపంలో హైవే మీద ఈ ప్రమాదం జరిగింది. రెండు వారాలుగా ఆయనకు చికిత్స చేస్తున్నప్పటికీ పరిస్థితి చేయిదాటి పోవడంతో ఆయన మృతి చెందారని డాక్టర్లు తెలిపారు.

మహేశ్ ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వెళ్తున్న లారీని వేగంగా డీకొట్టింది. దాంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయిపోయింది. తలకు, కంటికి తీవ్రగాయాలైన మహేశ్‌ను వెంటనే నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తరువాత ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. రెండు వారాలుగా ఆయనకు అక్కడే చికిత్స జరుగుతోంది.

తొలుత డాక్టర్లు ఆయనకు ప్రాణాపాయం ఏమీ లేదని, క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. కానీ, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మహేశ్‌ ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుకోవడంతో చనిపోయారని ఆయన సన్నిహితులు బీబీసీకి తెలిపారు.

అన్ని రకాల వైద్య సేవలు అందించినప్పటికీ,  పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో ఆయన ఎడమ కంటికి బాగా దెబ్బ తగిలింది. తలకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి.

ముఖానికి శస్త్ర చికిత్సలు పూర్తయిన తరువాత కత్తి మహేష్‌ను నెల్లూరు నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 17 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు కూడా ప్రకటించింది. చికిత్స తీసుకుంటున్న మహేష్ పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆయన మరణించారని డాక్టర్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)