You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అలెక్స్ హార్విల్: వరల్డ్ రికార్డ్ జంప్ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికా డేర్ డెవిల్: Newsreel
వాషింగ్టన్‌లో లాంగెస్ట్ మోటార్ సైకిల్ రాంప్ జంప్‌తో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయాలనుకున్న 28 ఏళ్ల అమెరికా డేర్ డెవిల్ ప్రాణాలు కోల్పోయాడు.
మోటార్ సైకిల్ జంప్ కోసం అలెక్స్ హార్విల్ గురువారం ఉదయం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై చనిపోయినట్లు అధికారులు చెప్పారు.
మోసెస్ లేక్ ఎయిర్ షోలో ప్రేక్షకుల మధ్య ఆయన తన మోటార్ సైకిల్‌తో 351 అడుగులు( 107 మీటర్లు) దూరం జంప్ చేయాలని ప్లాన్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియోలో అలెక్స్ మోటార్ సైకిల్ మట్టిగుట్టపై దిగాల్సిన చోటు కంటే కాస్త ముందే లాండ్ అయినట్లు, ఆయన ఆ మట్టిలో గుద్దుకున్నట్లు కనిపిస్తోంది.
ఆ ప్రమాదంలో హార్విల్ హాండిల్ బార్ మీద నుంచి ఎగిరిపడ్డారని, ఆయన హెల్మెట్ కూడా ఊడిపోయిందని స్థానిక పత్రికలు చెప్పాయి.
గాయపడ్డ హార్విల్‌ను మోసెస్ లేక్ ఎయిర్ షో నిర్వహకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, తర్వాత ఆయన చనిపోయారని స్థానిక పోలీసులు ధ్రువీకరించారు.
"ఆయన గత రెండు వారాలుగా ఈ స్టంట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. గురువారం చేసిన మొదటి ప్రయత్నానికి ముందు ఆయన ఎప్పుడూ అంత దూరం జంప్ చేయలేదు" అని కొడుకులతో కలిసి ఎయిర్ షోకు వచ్చిన అలెక్స్ భార్య జెస్సికా చెప్పారని కొలంబియా బేసిన్ పత్రిక తెలిపింది.
హార్విల్ ఒక ప్రొఫెషనల్ మోటోక్రాస్ రేసర్. ఆయన పేరున ఇప్పటికే రెండు మోటార్ సైకిల్ జంప్ రికార్డులు ఉన్నాయి.
గురువారం చేయబోయే వరల్డ్ రికార్డ్ గురించి ఉత్కంఠగా ఉన్న ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారు.
విద్యార్థి కార్యకర్తలు దేవాంగనా కలితా, నటాషా నర్వాల్, ఆసిఫ్ ఇక్బాల్‌కు దిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
అయితే, దిల్లీ హైకోర్ట్ తీర్పును ఏ కోర్టులోనూ ఉదాహరణగా పరిగణించరని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. నిందితుల విడుదలలో ప్రస్తుతం తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని తెలిపింది. తుది తీర్పు వచ్చేవరకూ వేచిచూడాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది.
దేవాంగనా కలితా, నటాషా నర్వాల్, ఆసిఫ్ ఇక్బాల్ బెయిల్‌ను సవాలు చేస్తూ దిల్లీ పోలీసులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ వీ. రామసుబ్రమణ్యమ్ వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది.
నిందితులు ముగ్గురికీ జూన్ 15న దిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిని జూన్ 17న దిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదల చేశారు. దిల్లీ పోలీసుల తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్ట్ తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరారు.
ఈ కేసు ముఖ్యమైనదని, దీని ప్రభావం మొత్తం భారత దేశం మీద పడవచ్చని జస్టిస్ హేమంత్ గుప్తా అధ్యక్షతన ఈ కేసును విచారించిన బెంచ్ చెప్పింది. తాము దీనిపై ఒక నోటీసు జారీ చేస్తామని, అన్ని పక్షాల వాదనలు వింటామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చినపుడు ఇదంతా జరిగిందని, నిందితులు అదే సమయంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించారని తుషార్ మెహతా వాదించారు.
ముస్లిం వృద్ధుడిని కొట్టిన కేసు: ట్విటర్ ఇండియా ఎండీకి లీగల్ నోటీసులు పంపిన యూపీ పోలీసులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ముస్లిం వృద్ధుడిన కొట్టిన కేసులో ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరికి యూపీ పోలీసులు లీగల్ నోటీసు పంపారు.
ఏడు రోజుల లోపల లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్‌లో తన వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో కోరారు.
కొంతమంది తమ ట్విటర్ హ్యాండిల్‌లో విద్వేషపూరిత సందేశాలను పోస్ట్ చేశారని, వాటిపై ట్విటర్ కమ్యూనికేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ నోటీసులో పేర్కొన్నారు.
ఈ కేసులో యూపీ పోలీసులు ట్విటర్ సహా పలువురు జర్నలిస్టుల మీద ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గత మంగళవారం నమోదైన కేసులో ట్విటర్, ట్విటర్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపక జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్, జర్నలిస్ట్ రానా అయూబ్, న్యూస్ వెబ్‌సైట్ ది వైర్, జర్నలిస్ట్ సబా నఖ్వీ, కాంగ్రెస్ నాయకుడు ముస్కూర్ ఉస్మానీ, కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ నిజామీ, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ షామా మహ్మద్‌లను నిందితులుగా పేర్కొన్నారు.
ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు. వైరల్ అయిన ఈ వీడియోలో ఒక ముస్లిం వృద్ధుడిని కొడుతున్నట్లు కనిపిస్తోంది.
ఇక ట్విటర్‌పై కూడా క్రిమినల్ కేసులు
కొత్త ఐటీ నిబంధనలు అమలు చేయకపోవడంతో ట్విటర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ఏఎన్ఐ తెలిపింది. ట్విటర్ 'సంధాన వేదిక'గా భారత్‌లో తన హోదాను కోల్పోనుందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
"కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా లేనందువల్ల ట్విటర్ ఇక మీదట భారత్‌లో 'సంధాన వేదిక'గా తన హోదాను కోల్పోనుంది" అని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు జూన్ 16న ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- ఏపీ: నూతన విద్యా విధానంతో వచ్చే మార్పులేంటి.. ఉపాధ్యాయ సంఘాల నేతలకు షోకాజ్ నోటీసులు ఎందుకు పంపారు
- సోనియా, రాహుల్, ప్రియాంక వ్యాక్సీన్ తీసుకున్నారా... ప్రశ్నించిన బీజేపీ, స్పందించిన కాంగ్రెస్
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)