హోటల్ యజమానిపై ఎస్ఐ దాడి

ప్రచురణ

తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ హోటల్ యజమాని స్థానిక ఎస్ఐపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.మామూళ్ల పేరుతో ఈ ఎస్ఐ తరచూ తమను వేధిస్తున్నారని ఆరోపించారు.తాము డబ్బులివ్వకపోవడంతో తమ సిబ్బందిపై, కస్టమర్లపై ఆయన దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ''ఈ ఎస్ఐ గతవారం ఇక్కడ భోజనం చేసి డబ్బులివ్వలేదు..డబ్బులు అడిగితే మమ్మల్ని బెదిరించారు.'' అని హోటల్ యజమాని చెప్పారు.హోటల్ సిబ్బందిపై ఎస్ఐ దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)