You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రమేశ్ జార్కిహొళి: యువతితో సన్నిహితంగా ఉన్న వీడియో వివాదం నేపథ్యంలో కర్ణాటక మంత్రి రాజీనామా - News reel
ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించి లైంగిక అవసరాలకు వాడుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జల వనరుల మంత్రి రమేశ్ జార్కిహొళి తన పదవికి రాజీనామా చేశారని ఏఎన్‌ఐ వార్తాసంస్థ వెల్లడించింది.
మంత్రి రమేశ్ ఓ యువతితో సన్నిహితంగా ఉన్నట్లున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత అక్కడ రాజకీయంగా కలకలం రేగింది.
ఆ వీడియోను దినేశ్ కలహళ్లీ అనే సామాజిక కార్యకర్త మీడియాకు విడుదల చేశారు.
కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మంత్రి లైంగికంగా ఆమెను వాడుకున్నారని దినేశ్ ఆరోపించారు.
అయితే, ఆ వీడియోలో ఉన్న యువతి కానీ.. సామాజిక కార్యకర్త దినేశ్ కానీ తనకు తెలియదని తొలుత రమేశ్ చెప్పారు.
తాను తప్పు చేసినట్లు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని ఆయన తెలిపారు.
అయితే, తాను తప్పు చేయనప్పటికీ నిష్పాక్షిక విచారణ జరిగేందుకు వీలుగా నైతిక బాధ్యతతో రాజీనామా చేస్తున్నానంటూ ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
తాప్సీ, అనురాగ్ కశ్యప్ నివాసాలపై ఐటీ దాడులు
నటి తాప్సీ పన్ను, దర్శకుడు అనురాగ్ కశ్యప్ సహా సినీరంగానికి చెందిన పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి.
ముంబయి, పుణెల్లో 20కి ప్రదేశాల్లో సోదాలు జరుగుతున్నట్లు బీబీసీ ప్రతినిధి సుప్రియ సోగలె తెలిపారు.
అనురాగ్ కశ్యప్‌కు చెందిన ఫాంటమ్ ఫిల్మ్స్, టాలెంట్ హంట్ కంపెనీ కార్యాలయాలు, ఇతర చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
2011లో అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోట్వానీ, మధు మంతెనలు ఫాంటమ్ ఫిలిమ్స్ సంస్థను స్థాపించారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 వ్యాక్సీన్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రావడం సాధ్యమేనా?
- ఆంధ్రప్రదేశ్: ‘ప్రచారానికి వెళ్తే పేరంటానికా అని ఎగతాళి చేశారు... మగవాళ్లందరినీ ఓడించాం’
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- బంగ్లాదేశ్ నుంచి వచ్చి నిజామాబాద్‌లో దొంగ పాస్‌పోర్టులు తీస్తున్నారు... ఏంటీ దందా?
- మోటేరా స్టేడియం.. అపూర్వమైన ప్రపంచ రికార్డులకు వేదిక
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- నరసరావుపేట అనూష హత్య: నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడా... పరారీలో ఉన్నాడా?
- సద్దాం హుస్సేన్ కూతురు రగద్: 'నా భర్తను మా నాన్నే చంపించారు'
- దేశద్రోహ చట్టం: అసమ్మతిని అణచివేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రం
- గ్యాంగ్ రేప్ నిందితుడు పోలీసులకు దొరక్కుండా 22 ఏళ్లు ఎలా తప్పించుకు తిరిగాడు?
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)