చెన్నై సూపర్ కింగ్స్‌లో సీమ కుర్రాడు: ‘ధోనీతో ఒక్క ఫొటో దిగితే చాలనుకున్నా... ఇప్పుడు కలిసి క్రికెట్ ఆడబోతున్నా’’

ప్రచురణ

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానిక ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేదనే అంశం ఇటీవల ఐపీఎల్ వేలం సందర్భంగా చర్చనీయమైంది. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రా జట్టు ఆటగాడు హరిశంకర్ రెడ్డికి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టులో చోటు దక్కడం ఆసక్తికరంగా మారింది.

రంజీ టోర్నీతో పాటుగా ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో సత్తా చాటిన మారం హరిశంకర్ రెడ్డిని ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో సీఎస్‌కే కొనుగోలు చేసింది. 'బాహుబలి ల్యాండ్ నుంచి' వస్తున్న ఆటగాడంటూ హరిశంకర్ గురించి ట్వీట్ చేసింది.

ఓ మారుమూల పల్లెలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన హరిశంకర్... అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన లీగ్‌కు ఎంపికయ్యేందుకు సాగించిన ప్రస్థానం ఆసక్తికరమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)