You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘ఆయన శరీరమే లేదు... వేరే వారిలో బతికే ఉన్నారు’’: ఎనిమిది మంది ప్రాణాలు నిలిపిన హైదరాబాద్ కానిస్టేబుల్
హైదరాబాద్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కే.ఆంజనేయులు విధులకు వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో కుటుంబ సభ్యులు జీవదానానికి ముందుకొచ్చారు. ఆంజనేయులు అవయవాల్ని సేకరించి అవసరమైన ఎనిమిది మందికి అమర్చి వారి ప్రాణాలు కాపాడారు.
''అవయవ దానం చేసి అందరికీ మంచి చేశాడు. గ్రేట్ అనిపించుకున్నాడు. కానీ మాకు లేదు.. అంతే..'' అంటూ కన్నీరు పెట్టుకున్నారు భార్య శివలీల.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న కోనేరు ఆంజనేయులు ఈ నెల 18న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన సొంతూరు నుంచి తిరిగి హైదరాబాద్ కి బైక్ పై వస్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్లో రెండు రోజుల చికిత్స తరువా 21వ తేదీ తెల్లవారుఝామున బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు వైద్యులు.
వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన తరువాత ఆ కుటుంబాన్ని అవయవ దానం కోసం ఒప్పించారు సైబరాబాద్ పోలీసులు. కుటుంబ సభ్యులతో పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడి, అవయవదానంపై అవగాహన కల్పించారు. దానికి వారు అంగీకరించారు. దీంతో ఆయన గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, కళ్లు వంటి ఎనిమిది అవయవాలను ఇతరులకు దానంగా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- GDP: ఆర్థిక సంక్షోభంలో భారతదేశం... 7.5 శాతం పడిపోయిన జీడీపీ
- GDP Meaning: జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం?
- నివర్ తుపాను తాకిడితో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తీవ్ర నష్టం
- కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరవేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏమిటి?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- గంగా నదిలోకి ఘరియల్ మొసళ్లను వదులుతున్నారు.. ఎందుకంటే...
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)