‘‘ఆయన శరీరమే లేదు... వేరే వారిలో బతికే ఉన్నారు’’: ఎనిమిది మంది ప్రాణాలు నిలిపిన హైదరాబాద్ కానిస్టేబుల్

వీడియో క్యాప్షన్, ‘‘ఆయన చనిపోయినా వేరే వారిలో బతికున్నారు’’
ప్రచురణ

హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కే.ఆంజనేయులు విధులకు వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో కుటుంబ సభ్యులు జీవదానానికి ముందుకొచ్చారు. ఆంజనేయులు అవయవాల్ని సేకరించి అవసరమైన ఎనిమిది మందికి అమర్చి వారి ప్రాణాలు కాపాడారు.

''అవయవ దానం చేసి అందరికీ మంచి చేశాడు. గ్రేట్ అనిపించుకున్నాడు. కానీ మాకు లేదు.. అంతే..'' అంటూ కన్నీరు పెట్టుకున్నారు భార్య శివలీల.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న కోనేరు ఆంజనేయులు ఈ నెల 18న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన సొంతూరు నుంచి తిరిగి హైదరాబాద్ కి బైక్ పై వస్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్లో రెండు రోజుల చికిత్స తరువా 21వ తేదీ తెల్లవారుఝామున బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు వైద్యులు.

వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన తరువాత ఆ కుటుంబాన్ని అవయవ దానం కోసం ఒప్పించారు సైబరాబాద్ పోలీసులు. కుటుంబ సభ్యులతో పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడి, అవయవదానంపై అవగాహన కల్పించారు. దానికి వారు అంగీకరించారు. దీంతో ఆయన గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, కళ్లు వంటి ఎనిమిది అవయవాలను ఇతరులకు దానంగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)