ఈ కాగితం బొమ్మలను దేశవిదేశాల్లో కొంటున్నారు.. ఏమిటి ప్రత్యేకత?

ప్రచురణ

‘‘తెలుపు అంటే అందం అన్న భావన మనలో నాటుకుపోయింది. దీన్ని మార్చేందుకే, నేను న్యూస్ పేపర్లను ఉపయోగించి నల్లటి బొమ్మలు తయారుచేస్తున్నా’’ అని కోయంబత్తూరుకు చెందిన రాధిక ఆర్ముగం చెప్తున్నారు.

ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయని.. జనాల మనసు మార్చేందుకు కూడా ఉపయోగపడతాయని ఆమె అంటున్నారు.

‘‘నా బొమ్మలన్నీ 2018 వరకూ తమిళనాడులోనే అమ్ముడయ్యేవి. 2019 నుంచి దిల్లీ, ముంబయి, కర్ణాటకల్లోనూ అమ్ముతున్నా. ఆయా నగరాల నుంచి విదేశాలకు కూడా నా బొమ్మలు వెళ్తున్నాయి’’ అని రాధిక తెలిపారు.

‘‘తెల్లటి రంగులో బొమ్మలు చేసివ్వమని కొందరు కస్టమర్లు ఒత్తిడి చేస్తుంటారు. కానీ, నేను ఒప్పుకోను. నల్లటి బొమ్మలే నా ప్రత్యేకత. అది నచ్చి, చాలా మంది వాటిని కొనుక్కుంటున్నారు. ఈ పని నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది’’ అని వివరించారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)