You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కొళాయి నీళ్లలో మనిషి మెదడును తినేసే అమీబా
అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం లేక్ జాక్సన్ ప్రాంత ప్రజలు కొళాయి నీటిని వాడొద్దని అక్కడి అధికారులు కోరారు. మెదడును తినేసే ప్రాణాంతక సూక్ష్మజీవులతో నీరు కలుషితమైందన్న అనుమానాల నేపథ్యంలో ఈ సూచన చేశారు.
సుమారు 27 వేల మంది ప్రజలు నివసించే లేక్ జాన్సన్ ప్రాంతంలో తాము సరఫరా చేస్తున్న నీరు 'నేగ్లెరియా ఫోలరీ' అనే ఒక రకం అమీబాతో కలుషితమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఈ అమీబాతో కలుషితమైన నీరు ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లినప్పుడు అవి ప్రాణాంతకంగా మారుతాయి.
అమెరికాలో ఈ రకం అమీబా సోకడం అరుదే. 2009, 2018 మధ్య కాలంలో ఇలాంటివి 34 కేసులు గుర్తించారు.
టెక్సస్‌లోని ఎనిమిది ప్రాంతాలకు తొలుత ఈ హెచ్చరికలు చేశారు. తాము సరఫరా చేసిన కొళాయి నీటిని టాయిలెట్ ఫ్లష్ చేయడానికి తప్ప ఇంక దేనికీ వాడొద్దని అధికారులు కోరారు.
ఇవి కూడా చదవండి:
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (1946-2020): నాలుగు దశాబ్దాల్ని అలరించిన సుమధుర గాత్రం
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)