కొళాయి నీళ్లలో మనిషి మెదడును తినేసే అమీబా

వీడియో క్యాప్షన్, కొళాయి నీళ్లలో మెదడును తినేసే అమీబా
ప్రచురణ

అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం లేక్ జాక్సన్ ప్రాంత ప్రజలు కొళాయి నీటిని వాడొద్దని అక్కడి అధికారులు కోరారు. మెదడును తినేసే ప్రాణాంతక సూక్ష్మజీవులతో నీరు కలుషితమైందన్న అనుమానాల నేపథ్యంలో ఈ సూచన చేశారు.

సుమారు 27 వేల మంది ప్రజలు నివసించే లేక్ జాన్సన్ ప్రాంతంలో తాము సరఫరా చేస్తున్న నీరు 'నేగ్లెరియా ఫోలరీ' అనే ఒక రకం అమీబాతో కలుషితమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఈ అమీబాతో కలుషితమైన నీరు ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లినప్పుడు అవి ప్రాణాంతకంగా మారుతాయి.

అమెరికాలో ఈ రకం అమీబా సోకడం అరుదే. 2009, 2018 మధ్య కాలంలో ఇలాంటివి 34 కేసులు గుర్తించారు.

టెక్సస్‌లోని ఎనిమిది ప్రాంతాలకు తొలుత ఈ హెచ్చరికలు చేశారు. తాము సరఫరా చేసిన కొళాయి నీటిని టాయిలెట్ ఫ్లష్ చేయడానికి తప్ప ఇంక దేనికీ వాడొద్దని అధికారులు కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)