ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం: 'కోవిడ్ 19 నెగటివ్ వచ్చింది.. ఇంకా ఐసీయూలోనే ఉన్నారు'

ప్రచురణ

ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యానికి తాజాగా చేసిన కరోనావైరస్ పరీక్షల్లో 'నెగటివ్' అని వచ్చిందని ఆయన కుమారుడు ఎస్‌పీ చరణ్ తెలిపారు.

అయితే ఆయన ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని చెప్పారు. సోమవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోలో చరణ్ ఈ వివరాలు తెలిపారు.

బాలు నెలకు పైగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ నుంచి బాలు ఇంకా కోలుకోవాల్సి ఉందని చరణ్ తెలిపారు.

ఊపిరితిత్తులు మెరుగుపడుతున్నాయని, అయితే దీనికి కొంత సమయం పడుతోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)