లాక్‌డౌన్ కారణంగా తాపీ మేస్త్రీగా మారిన కండక్టర్

ప్రచురణ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన దినేశ్ పర్మార్ అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ బస్సుల్లో 12 ఏళ్లుగా కాంట్రాక్ట్ కండక్టరుగా పనిచేస్తుండేవారు.

కానీ లాక్‌డౌన్ కారణంగా బస్సులు ఆగిపోవడంతో జీతం కూడా నిలిపివేశారు.

దీంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు దినేశ్ తాపీ పనికి వెళ్తున్నారు.

జీతం రాకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారిందని.. ఒకవైపు కూరలోకి టమోటా కూడా కొనలేని పరిస్థితిలో ఉంటే వేలకువేలు కరెంటు బిల్లులు వస్తున్నాయని.. ఇలాంటి సమయంలో జీవనం సాగించడానికి దినేశ్ తాపీ పనికి వెళ్లాల్సివస్తోందని ఆయన భార్య తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)