ఈమె ట్రాక్టర్ స్టీరింగ్ పట్టడం వెనుక కన్నీటి కథ
ఈమె ట్రాక్టర్ స్టీరింగ్ పట్టడం వెనుక కన్నీటి కథ
ప్రచురణ
గుజరాత్‌లోని కచ్ జిల్లా మాధాపర్‌లో నివసించే శాంతాబేన్ కథ ఇది.
2002లో భర్త అకాల మరణం, అనారోగ్యం కారణంగా శాంతాబేన్ కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది.
ఆ సమయంలో ధైర్యంగా ముందడుగు వేసి వ్యవసాయ బాధ్యతలను భుజాన వేసుకున్నారామె.
అందుకోసం మొదట టూ వీలర్, ఆ తర్వాత ట్రాక్టర్ నడపడం కూడా నేర్చుకున్నారు.
అలా కష్టపడుతూ తన పిల్లలను బాగా చదివించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









