SLBC రెస్క్యూ ఆపరేషన్ : సొరంగంలో 13 కి.మీ. లోపల పరిస్థితి ఎలా ఉందంటే...
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదానికి సంబంధించి అసలైన రెస్క్యూ ఆపరేషన్ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మొదలైంది.
అప్పటి వరకూ ఘటనా స్థలానికి చేరుకున్న బృందాలు, సొరంగం నుంచి మట్టి తొలగింపు ప్రథమ కర్తవ్యంగా రంగంలోకి దిగాయి. లోపల ఉన్న వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ - ఎస్ఎల్‌బీసీ) సొరంగంలో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలు కాగా, ఎనిమిది మంది సొరంగం లోపలే చిక్కుకుపోయారు.
SLBC టన్నెల్ లోపల ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టడానికి ముందు అక్కడ పరిస్థితి ఎలా ఉందో పరిశీలించడానికి రెస్క్యూ సిబ్బంది వీటిని చిత్రించారు. ఇవి ఆ దృశ్యాలు...


ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









