గాజా-జబాలియా: క్షతగాత్రులతో నిండిపోతున్న ఆసుపత్రులు
ఉత్తర గాజాలోని ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్లో తమ టాంక్ బ్రిగేడ్ కమాండర్ మరణించారని ఇజ్రాయెలీ మిలిటరీ తెలిపింది. హమాస్‌పై సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న సీనియర్ ఇజ్రాయెలీ అధికారుల్లో ఈయన కూడా ఒకరు.
ఉత్తర గాజాలో నివాస ప్రాంతమైన బీత్ లాహియాపై ఇజ్రాయెల్ గడిచిన శనివారం, ఆదివారం దాడులు చేసింది. ఈ దాడుల్లో 87 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారని హమాస్ నిర్వహణలోని ఆరోగ్య శాఖ తెలిపింది.
అయితే గాజాలోకి బీబీసీని, ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలను ఇజ్రాయెల్ అనుమతించట్లేదు. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బీబీసీ ప్రతినిధి ఫెర్గల్ అక్కడి పరిస్థితులను వివరిస్తూ అందిస్తున్న కథనం...

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









