You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పోలీసు బలగాల మధ్య తీవ్ర ఘర్షణ..
జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలంటూ, పీటీఐ పార్టీ కార్యకర్తలు చేస్తున్న నిరసన మార్చ్ హింసాత్మకంగా మారింది.
ప్రభుత్వం విధించిన ఆంక్షలను లెక్కచేయకుండా వేల మంది ఆందోళనకారులు ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ వైపు దూసుకొచ్చారు. వారు నగరం లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు రోడ్లపై పోలీసులు భారీ ఎత్తున బారికేడ్లు పెట్టారు.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి. నిరసనకారులు కూడా రాళ్లు, కర్రలు రువ్వారు.
దీంతో, ఇరువైపులూ ప్రాణనష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్‌లో నెలకొన్న తాజా ఉద్రిక్తతలపై మరింత సమాచారం ఈ వీడియో కథనంలో అందిస్తున్నాం..
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)