నెలసరిలో ఉన్న ఆడపిల్లలకు ప్యాడ్స్ ఇవ్వడానికి హాస్టల్ సిబ్బంది వేస్తున్న ప్రశ్నలు ఏంటంటే...

నెలసరిలో ఉన్న ఆడపిల్లలకు ప్యాడ్స్ ఇవ్వడానికి హాస్టల్ సిబ్బంది వేస్తున్న ప్రశ్నలు ఏంటంటే...
ప్రచురణ

అన్నమయ్య జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తనిఖీకి వెళ్లిన అధికారులకు అక్కడ చదువుకుంటున్న విద్యార్థినులు కన్నీళ్లతో తమ బాధలు చెప్పుకోవడం, స్కూల్లో తమను వేధిస్తున్నారని ఆరోపించడం కలకలం సృష్టించింది.

పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్స్ అడిగితే, పీరియడ్స్ వచ్చినట్లు ఆధారాలు చూపించాలని స్టాఫ్ అడుగుతున్నారని విద్యార్థులు తమతో చెప్పారని సోషల్ ఆడిట్ టీమ్‌కు చెందిన సరిత 'బీబీసీ'తో చెప్పారు.

''నెలసరి సమయంలో అమ్మాయిలకు 5 ప్యాడ్లు ఇస్తున్నట్లు రిజిస్టర్‌లో రాస్తున్నారు. కానీ, తమకు రెండు మాత్రమే ఇస్తున్నట్లు పిల్లలు చెబుతున్నారు. నెలసరి వచ్చినప్పుడు తలస్నానం చేసే సమయంలో ప్రతి విద్యార్థిని నుంచి రూ. 100 అడుగుతున్నారని తెలిసింది. ఆహారంలో నాణ్యత ఉండట్లేదు. ఎవరైనా తనిఖీలకు వచ్చిన సమయంలో మాత్రమే బాగా వండుతున్నారు. మిగిలిన సమయంలో సరిగా ఉండటం లేదు. మెనూ ప్రకారం కూడా పెట్టడం లేదు'' అని సరిత తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)