You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోతున్న దేశం ఇది..
- రచయిత, విక్టోరియా గిల్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
- ప్రచురణ
ఈజిప్ట్‌లో జరుగుతున్న కాప్ 27 సదస్సులో ఒప్పందం కుదుర్చుకోవడానికి సమయం మించిపోతోంది.
దాదాపు రెండు వారాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమైన ఒప్పందాలు, నిర్ణయాలు కుదుర్చుకోవడానికి శుక్రవారమే చివరిరోజు అవ్వాల్సి ఉంది.
కాగా ఈ చర్చలు విఫలమవ్వచ్చు అనే ఆందోళన కూడా ఉంది.
వాతావరణ మార్పులకు ఇదొక కఠిన వాస్తవం... ఫసిఫిక్ సముద్రంలోని చిన్న ద్వీప దేశం టువాలు ఆ సముద్రం జలాల్లో మునిగిపోతోంది.
యూఎన్ వాతావారణ సదస్సు ప్రారంభమై దాదాపుగా రెండు వారాలవుతోంది. అయినా ఇలాంటి వాటికి కలిగిన నష్టాలు.. వాటికి పరిష్కార మార్గాలు మాత్రం అపరిష్కృతంగా ఉన్నాయి.
‘‘కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు వీటికి అడ్డుతగులుతున్నాయి. వాటిలో అమెరికా ప్రధానమైంది. చర్చలు ముందుకెళ్లకుండా అడ్డుకుంటోంది. చర్చల్లో పురోగతి లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. జరుగుతున్న నష్టం, విధ్వంసాన్ని ఆపే పరిష్కారాలుంటాయని మేము భావించాం’’ అని క్రిస్టియన్ ఎయిడ్ సంస్థకు చెందిన నుష్రత్ చౌధురీ అన్నారు.
వాతావరణ మార్పుల వల్ల జరిగిన నష్టానికి, అందరికీ ఆహారం అందించడం, పెరుగుతున్న ఖర్చుల్నితిరిగి చెల్లించాలనే సంకల్పాన్ని అభివృద్ధి చెందిన దేశాలు పక్కన పెట్టాలని అనుకుంటున్నాయి.
వాతావరణ మార్పుల వల్ల తలెత్తిన తుఫానులు, వరదలతో జరిగిన విధ్వంసాలను ఎదుర్కొనేందుకు నిధులను సమకూర్చాల్సిన అవసరం ఉందనే విషయాన్ని చాలా దేశాలు అంగీకరించాయి.
కానీ కచ్చితంగా నిధులు ఇచ్చేదెవరు? బాధిత ప్రజలకు ఆ సాయం ఎలా చేరుతుంది? ఇలాంటి సమస్యలపైనే దేశాలు మల్లగుల్లాలుపడుతున్నాయి.
టువాలుకు సంబంధించి ఇప్పటికే సమయం మించిపోయింది.
‘‘కాప్27 లో ఈవారం ఏ జరిగినా.. టువాలుకి దాంతో సంబంధం ఉండదు. మేము లోతట్టు ప్రాంతంలో ఉంటాం. మా భూమిని మా ప్రజలను కాపాడుకోవడానికి మాకున్న ఒకే ఒక మార్గం సముద్ర మట్టం కంటే ఎత్తుగా మా ప్రాంతాన్ని తయారు చేయడం. నేలను పునర్నిర్మించడం’’ అని టువాలు ఆర్థిక మంత్రి సీవ్ పేన్యూ అన్నారు.
ఇప్పటికి ఎన్నో చర్చలు జరిగాయి. కానీ ఓ అంగీకారం కుదరలేదు. బాధిత దేశాలు మాత్రం.. ప్రాణాల కోసం పోరాడుతున్నామని చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- 2 వేల రూపాయల నోట్లు ఏమైపోయాయి.. ఈ నోటును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందా
- చైనాలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం నిర్బంధాలు, వేధింపులను తట్టుకోలేక కుటుంబాలను వదిలేసి పారిపోతున్న ప్రజలు
- తొలిసారి కుమార్తెను ప్రపంచానికి చూపించిన కిమ్ జోంగ్ ఉన్..
- గాడిద పాలతో కోటి రూపాయల వ్యాపారం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు
- ఫుట్‌బాల్: భారత జట్టుకు వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చినా ఎందుకు ఆడలేదు?
- అమెరికా సహా పలు దేశాల్లో చైనా సీక్రెట్ పోలీస్ స్టేషన్లు, ఇక్కడ ఏం చేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)