కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో 'స్మార్ట్ క్లాస్' చెబుతున్న 13 ఏళ్ల టీచర్

ప్రచురణ

లాక్‌డౌన్ సమయంలో పిల్లల చదువు కొనసాగాలనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ క్లాస్‌ను మొదలుపెట్టినట్లు అనామిక చెబుతోంది. "నగరాల్లో పుస్తకాలు దొరకడం సులువు. ఇక్కడ మాకు గ్రంథాలయాలు, బుక్ స్టాళ్లు, ట్యూషన్ కేంద్రాల వంటి సదుపాయాలు లేవు. నా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కానీ, ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఈ సమస్యలన్నీ ఉన్నా మేం చదువుకుంటున్నాం. స్కూల్లో నేను నేర్చుకున్నది ఇక్కడ చిన్నారులకు చెప్పడం ఆనందాన్నిస్తోంది" అని వివరిస్తోంది.

తాము రోజూ పని మీద వెళ్లినప్పుడు పిల్లలు బుద్ధిగా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారంటూ పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)