దిల్లీ నుంచి చెన్నై వరకు..
వేడెక్కుతున్న భారతీయ నగరాలు
భారతీయ నగరాలు వేడెక్కుతున్నాయి. అయితే, ఈ నగరాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరి మీద ఆ ప్రభావం ఒకేలా లేదు. అమెరికన్ జియోలాజికల్ సర్వే ద్వారా ల్యాండ్‌శాట్ అనే ఉపగ్రహం నుంచి తీసిన ఫోటోలను విశ్లేషించినప్పుడు.. ఒకే నగరంలోని వివిధ ప్రాంతాల్లో, ఉష్ణోగ్రతల్లో తేడాలు ఉన్నట్లు స్పష్టంగా చూపించింది.
ల్యాండ్ శాట్ అనేది అమెరికా జియోలాజికల్ సర్వే, నాసా సంయుక్తంగా చేపట్టిన మిషన్. ఇది భూమి ఉపరితల ఫోటోలను అందిస్తుంది. అధికంగా భవనాలు, కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న ప్రాంతాలతో పోలిస్తే పార్కులు, చెట్ల ఆవరణ లేదా నీటి వనరులు ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంది. ఇది చాలా కీలకమైన అంశం.
ఎందుకంటే 2020లో 48 కోట్లున్న భారతదేశపు పట్టణ జనాభా, 2050 నాటికి 95 కోట్లకు చేరుకోనుందని ప్రపంచ బ్యాంక్, గృహ, పట్టణాభివృద్ధి శాఖ అంచనా వేశాయి. దీనికితోడు చాలా మందికి వేసవిలో ఉపశమనం కలిగించే శీతల వ్యవస్థలు అందుబాటులో లేవు. నగరాల్లో 12.6 శాతం మంది వద్ద మాత్రమే ఎయిర్ కండీషనర్లు, 22 శాతంమంది వద్ద ఎయిర్ కూలర్లు ఉన్నాయి.
నగరాలు ఎలా వేడెక్కుతున్నాయి?
దిల్లీ
ముంబయి
అహ్మదాబాద్
చెన్నై
హైదరాబాద్
నగరాన్ని ఎంచుకోండి
మ్యాప్ లోడ్ అవుతోంది..
గత రెండు దశాబ్దాల్లో భారతీయ నగరాలు వేగంగా విస్తరించాయి. నగరాల్లో నిర్మాణాలు పెరిగాయి. అనేక ప్రాంతాల్లో పచ్చదనం మాయమైంది. వ్యవసాయ భూములు తగ్గిపోయాయి. ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాలు కనిపించడం లేదు.
అడవులు, పొలాలు, నీటి వనరులతో పోలిస్తే రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక వసతుల నుంచి వేడి ఎక్కువగా వస్తుంది. అందుకే నగరాల చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల కంటే నగరాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. దీనిని “అర్బన్ హీట్ ఐలండ్ ప్రభావం” అని పిలుస్తున్నారు.
2003- 2020 మధ్య భారతీయ నగరాలు దేశంలోని మిగతా ప్రాంతాల కంటే దాదాపు రెట్టింపు వేగంతో వేడెక్కాయి. ఈ కాలంలో 30 శాతం నగరీకరణ జరగడం వల్ల ఈ వేడి పెరిగిందని 2024లో నేచర్ సిటీస్ అధ్యయనం గుర్తించింది.
గత రెండు దశాబ్ధాలలో నగరం ఎలా విస్తరించింది
ఈ మ్యాప్ {{city-name}} 2000 సంవత్సరం నుంచి 2020 మధ్య నివాస ప్రాంతం ఎంతగా విస్తరించిందో సూచిస్తుంది. ఇళ్లు, దుకాణాలు , వాణిజ్య భవనాలు, పారిశ్రామిక ప్రాంతాలు , రహదారుల నిర్మాణం ఎలా జరిగిందో చూడవచ్చు.

కాలానుగుణంగా ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతూ వచ్చాయంటే..
మే 2026 ( గరిష్ఠ ఉష్ణోగ్రత)
మే 2026 ( గరిష్ఠ ఉష్ణోగ్రత)
మే 2026 ( గరిష్ఠ ఉష్ణోగ్రత)
మే 2026 ( కనిష్ఠ ఉష్ణోగ్రత)
మే 2026 ( కనిష్ఠ ఉష్ణోగ్రత)
మే 2026 ( గరిష్ఠ ఉష్ణోగ్రత)
యూఎస్ జియోలాజికల్ సర్వే నుంచి పొందిన ల్యాండ్ శాట్ ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి భూమి ఉపరితల ఉష్ణోగ్రత మ్యాప్‌లు తయారు చేశారు. ఈ చిత్రాలను వాటి తాజా స్థితి, మేఘాల ఉనికి, చిత్రం తీసిన రోజున ప్రతి నగరంలోని ఉష్ణోగ్రత ఆధారంగా ఎంపిక చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన గ్లోబల్ ల్యాండ్ అనాలిసిస్ అండ్ డిస్కవరీ ల్యాబ్ అందించిన భూభాగ వినియోగ డేటాను నగరాల విస్తరణ విశ్లేషణ కోసం ఉపయోగించారు. భారత వాతావరణ విభాగం గ్రిడ్ డేటాసెట్ నుంచి నగరాల రోజువారీ ఉష్ణోగ్రత డేటా తీసుకున్నారు. ప్రతి నగరానికి ముందుగా 1991–2020 కాలానికి నెలవారీ సగటు ఉష్ణోగ్రతలను లెక్కించారు. ఐఎండీ కూడా ఇదే కాలాన్ని తన లాంగ్ పీరియడ్ యావరేజ్ కోసం సూచిక కాలంగా ఉపయోగిస్తుంది. తర్వాత తాజా ఉష్ణోగ్రతలను “సాధారణం”తో పోల్చేందుకు 2024, 2025, 2026 సంవత్సరాల కోసం కూడా ఇదే లెక్కింపును మళ్లీ చేశారు.
క్రెడిట్స్
మ్యాప్స్, డేటా, వర్డ్స్: జాస్మిన్ నిహలాని
డిజైన్: వాసిఫ్ ఖాన్, యూజీన్ చౌహాన్ & చేతన్ సింగ్
యానిమేషన్: వాసిఫ్ ఖాన్
డెవలప్మెంట్: కావేరి బిస్వాస్, ప్రీతి వఘేలా
అనువాదం: పారా పద్దయ్య, షేక్ అన్సారి
భారత్: ఎన్నికల్లో 'సంక్షేమ మంత్రం' ప్రభావం తగ్గుతోందా? స్టాలిన్, మమత, విజయన్ ప్రభుత్వాల ఓటమి ఏం చెబుతోంది?
145 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలని అంటున్నారు ఎందుకు?
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం ఎలా