ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కవిత, సాక్షులను ప్రభావితం చేసేందుకు, సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని అందుకే జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతున్నట్లు ఈడీ కోర్టులో వాదించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
భారత్‌లో ఈద్‌ను ఏప్రిల్ 11వ తేదీన జరుపుకోనున్నారు.
సాధారణంగా ఈద్-వుల్-ఫితర్‌ను ముస్లింల పవిత్ర రమదాన్ మాసం చివర్లో జరుపుకుంటారు.
అయితే, మంగళవారం చంద్రుడు కనిపించకపోవడంతో 11వ తేదీన ఈద్‌ను జరుపుకోవాలని నిర్ణయించినట్లు లఖ్‌నవూలోని మరకజీ చాంద్ కమిటీ తెలిపింది.
ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా చైర్మన్ మౌలానా ఖాలిద్ రషీద్ మాట్లాడుతూ.. ‘‘2024, ఏప్రిల్ 9నాడు ఆకాశం నిర్మలంగా ఉంది. కానీ, చంద్రుడు కనిపించలేదు. దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ చంద్రుడు కనిపించినట్లు ఎలాంటి సమాచారం లేదు. కాబట్టి రేపు అంటే ఏప్రిల్ 10న రొజా 30వ రోజు. కాబట్టి 11న ఈద్ నిర్వహించాలని నిర్ణయించాం’’ అని చెప్పారు.
మరోవైపు దిల్లీ జామా మసీదు ఇమామ్, ఫతేపురీ మసీదు ఇమామ్‌లు కూడా ఏప్రిల్ 11వ తేదీనే ఈద్ జరుపుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
ఇస్లామిక్ వేడుకలు, సంప్రదాయాలు చంద్రుడిని అనుసరించే క్యాలండర్ ప్రకారం ఉంటాయి.
ఈ క్యాలండర్‌లోనూ 12 నెలలు ఉంటాయి. దీనిలో రమదాన్ తొమ్మిదో నెల.
దిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు కోర్టు పొడిగించింది.
జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియనుండటంతో ఆమెను మంగళవారం తిహాడ్ జైలు నుంచి దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు.
కవిత, సాక్షులను ప్రభావితం చేసేందుకు, సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని అందుకే జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతున్నట్లు ఈడీ కోర్టులో వాదించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని ఈడీ కోరినట్లు ఏఎన్‌ఐ వెల్లడించింది.
మార్చి 15వ తేదీన ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది.
ఇదొక రాజకీయ కేసు అని కవిత అన్నారు. ‘‘ఇది పూర్తిగా స్టేట్‌మెంట్ల ఆధారంగా నమోదు చేసిన కేసు. రాజకీయ కేసు. ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని ఈ కేసు పెటటారు. జైలులో సీబీఐ నా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో మరో భారతీయ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.
గత నెల నుంచి అదృశ్యమైన మొహమ్మద్ అబ్దుల్ అరాఫత్ మృతదేహాన్ని క్లీవ్‌ల్యాండ్‌లో గుర్తించినట్లు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ట్వీట్ ద్వారా తెలిపింది.
హైదరాబాద్‌కు చెందిన అరాఫత్ వయస్సు 25 ఏళ్లు.
అరాఫత్ కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు కొన్ని వారాల క్రితం భారత కాన్సులేట్ తెలిపింది.
మంగళవారం తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో, ‘‘అరాఫత్ మరణం చాలా బాధాకరం. కొన్ని రోజులుగా అరాఫత్ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. తాజాగా ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌లో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అరాఫత్ మరణంపై పటిష్ట దర్యాప్తు జరిగేలా స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని భారత్‌కు పంపించడంలో సహకరిస్తాం’’ అని భారత కాన్సులేట్ పేర్కొంది.
సరిగ్గా నాలుగు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 5న క్లీవ్‌ల్యాండ్‌లో మృతిచెందిన భారతీయ విద్యార్థి ఉమా సత్యసాయి మరణవార్త బయటకు వచ్చింది.
మాస్టర్స్ చేయడం కోసం 2023లో మొహమ్మద్ అరాఫత్ అమెరికా వెళ్లారు. క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో చేరారు. అయితే, గత నెల నుంచి ఆయన అదృశ్యమయ్యారు. తర్వాత లక్ష రూపాయలు (1200 డాలర్లు) ఇవ్వాలంటూ అరాఫత్ తండ్రికి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
మీడియా కథనాల ప్రకారం, మార్చి 7న చివరగా అరాఫత్‌తో ఆయన తండ్రి మాట్లాడారు.
ఈ ఏడాది చాలామంది భారతీయ విద్యార్థుల అమెరికాలో చనిపోయారు.
సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసే ప్రతీ ఒక్కరిని జైల్లో పెట్టలేమని వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఒక యూట్యూబర్ బెయిల్‌ను కొనసాగించాలని ఆదేశించింది.
2021లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఈ యూట్యూబర్ మీద ఆరోపణలు ఉన్నాయి.
జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం యూట్యూబర్ సత్తాయి దురైమురుగన్ బెయిల్ రద్దు ఉత్తర్వులను తిరస్కరించింది.
‘‘ఎన్నికలకు ముందు యూట్యూబ్ వేదికగా ఆరోపణలు చేసే వారందరినీ జైల్లో పెట్టడం మొదలుపెడితే, ఎంతమంది జైల్లో ఉంటారో ఆలోచించండి’’ అని తమిళనాడు సర్కార్ తరఫున వాదనలు వినిపిస్తోన్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఉద్దేశిస్తూ బెంచ్ వ్యాఖ్యానించింది.
నిందితుడు భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది.
2021లో మురుగన్‌ను అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ, 2002 జూన్ 7న హైకోర్టు డివిజన్ బెంచ్ ఆయన బెయిల్‌ను రద్దు చేసింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.