ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సిరియా రాజధాని నగరం డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిందని సిరియా ప్రభుత్వ మీడియా ఆరోపించింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
సిరియా రాజధాని నగరం డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిందని సిరియా ప్రభుత్వ మీడియా ఆరోపించింది.
మీడియా కథనాాల ప్రకారం, ఈ దాడి కారణంగా ఈ భవనం కుప్పకూలింది, కొందరు మరణించారు.
ఈ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన మహ్మద్ రెజా జహెదీ, ఆయన డిప్యూటీ మరణించినట్లు ఇరాన్ ప్రెస్ టీవీ రిపోర్టు చేసింది.
దాడిలో మృతులపై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. ఘటనలో ఐదుగురు మరణించినట్లు ఇరాన్ వార్తాసంస్థ ఒకటి చెప్పింది. ఎనిమిది మంది మరణించినట్లు బ్రిటిష్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ పేర్కొంది.
ఇరాన్ కాన్సులేట్ భవనం ఇరాన్ రాయబార కార్యాలయానికి సమీపంలో ఉందని చెబుతున్నారు.
అయితే విదేశీ మీడియా కథనాలపై తాము స్పందించబోమని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
గోలన్ హైట్స్ నుంచి ఇజ్రాయెల్ విమానం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు) దాడి చేసిందని సిరియన్ ఆర్మీ ఆరోపించింది.
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని వ్యాస్ బేస్‌మెంట్‌లో హిందువుల పూజలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
మసీదులోని తెహ్‌ఖానాలో ముస్లింల నమాజ్, హిందూ పూజలకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అంతేకాదు, తమ అనుమతి లేకుండా ఈ యథాతథ స్థితిని మార్చరాదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
గతంలో హిందువులు అక్కడ పూజలు చేసుకునేందుకు వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టు అనుమతిచ్చింది. ఆ ప్రకారం జనవరి 31 తర్వాత జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని వ్యాస్ బేస్‌మెంట్‌లో హిందువులు పూజలు మొదలుపెట్టారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ మొదట అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు స్టేకు నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించింది. అక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.
జులైలో ఈ అంశంపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం వెలువరించనుంది.
తాజా ఉత్తర్వుతో జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ముస్లింల నమాజ్, హిందువుల పూజలూ కొనసాగనున్నాయి.
దిల్లీ పాత మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 15వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీచేసింది.
విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది.
కేజ్రీవాల్ తన ఫోన్ పాస్‌వర్డ్ చెప్పడం లేదని ఈడీ న్యాయవాది ఎస్వీ రాజు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘‘మోడీ చర్యలు దేశానికి మంచివి కావని’’ తెలిపారు.
దిల్లీ పాత మద్యం విధానానికి సంబంధించిన కేసులో కేజ్రీవాల్ మార్చి 21న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.