You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే రైతుల ఆత్మహత్యలు - కేసీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లోఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. రాంలీలా మైదానంలో ‘ఇండియా’ మెగా ర్యాలీ: ప్రధాని మోదీ రాముడి జీవితం నుంచి నేర్చుకోవాలి- ప్రియాంక గాంధీ

  3. తెలంగాణ: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే రైతుల ఆత్మహత్యలు - కేసీఆర్

    కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు.

    ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లోఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.

    సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లే రైతులు నష్టపోయారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు మళ్లీ వస్తాయని అనుకోలేదు. మేం రైతుల తరుఫున పోరాటం చేస్తాం” అన్నారు.

    పంటలు ఎండుతుంటే చూస్తూ ఊరుకోం-కేసీఆర్

    కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలల సమయం గడిచేవరకూ తాను మాట్లాడలేదని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దురుసుగా మాట్లాడినా నోరు మెదపలేదని అన్నారు కేసీఆర్.

    “లక్షల ఎకరాల పంట ఎండిపోతుందే చూస్తూ ఉండలేకపోయాను. అందుకే రైతులకు ధైర్యం చెప్పడానికి వచ్చాను. రైతులకు మేం ఉన్నాం. మీ తరఫున మేం పోరాటం చేస్తాం” అన్నారు.

  4. ఈ కానిస్టేబుల్‌ను ఖాకీ డ్రెస్సులో ఉన్న ‘దేవదూత’ అని స్థానికులు ఎందుకు అంటున్నారు?

  5. కచ్చతీవు: తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య తగవుకు కారణమైన ఈ దీవి కథ ఏంటి?

  6. ఉద్ధవ్ ఠాక్రే: ‘ఒకే వ్యక్తి, ఒకే పార్టీ ఆధారిత ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన సమయం ఇది’

    ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్ల కోసం తపిస్తోందని, అయితే ఒకే వ్యక్తి, ఒకే పార్టీ ఆధారిత ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన సరైన సమయం ఇదేనని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.

    దిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో జరుగుతున్న మహార్యాలీలో పాల్గొన్న ఆయన ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే ఈ వేదికపైకి వచ్చామని, ఇది ఎన్నికల ప్రచారం కాదని చెప్పారు.

    ఒకప్పుడు కొందరిని అవినీతిపరులని ఆరోపించిన బీజేపీ ఇప్పుడు వారినే పార్టీలోకి తీసుకుందని ఉద్ధవ్ విమర్శించారు. అవినీతిపరులతో కూడిన ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తుందంటూ ప్రశ్నించారు.

  7. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య

    బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు సీనియర్ నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.

    హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు.

    ఇటీవల వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కావ్య, పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఆ మేరకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆమె ఒక లేఖ రాశారు.

    కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు, దిల్లీ మద్యం కుంభకోణం లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని ఆమె అందులో ఆరోపించారు. జిల్లాలోని పార్టీ నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం పార్టీకి నష్టం చేస్తుందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకొన్నట్లు చెప్పారు.

    కడియం శ్రీహరి ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

  8. అధిక బరువు వేధిస్తోందా? డబ్ల్యూహెచ్‌వో సలహాలు ఇవీ

  9. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేశాక వేల కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లకు గ్రీన్ సిగ్నల్.. కేంద్రం ఆలోచన ఏమిటి?

  10. మయాంక్ యాదవ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పంజాబ్ కింగ్స్ ఓటమి, లక్నో గెలుపు

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) తొలి విజయాన్ని నమోదు చేసింది.

    శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 21 పరుగుల తేడాతో గెలిచింది.

    టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు చేసింది.

    క్వింటన్ డికాక్ (54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా, కృనాల్ పాండ్యా (22 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు.

    కెప్టెన్ నికోలస్ పూరన్ (21 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు.

    పంజాబ్ బౌలర్లలో స్యామ్ కరన్ 3, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీశారు.

    అనంతరం శిఖర్ ధావన్ (50 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చక్కగా ఆడటంతో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది.

    ఈ దశలో పంజాబ్ గెలుపు ఖాయంగానే కనిపించింది.

    కానీ, మిగతా బౌలర్లు చేతులెత్తేసిన సమయంలో, కొత్త బౌలర్ మయాంక్ యాదవ్ (3/27) రాణించి లక్నోకు విజయాన్ని అందించాడు.

    మయాంక్ కట్టడి చేయడంతో పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులే చేయగలిగింది.

  11. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్‌ను క్లిక్ చేయండి.