ఎంఫిల్ డిగ్రీలు చెల్లవు, అడ్మిషన్లు తీసుకోకండి: యూజీసీ

ఎంఫిల్ (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) డిగ్రీకి గుర్తింపు లేదని, ఆ కోర్సులో చేరొద్దని విద్యార్థులకు సూచించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).

లైవ్ కవరేజీ

  1. నీళ్లలో మీ మలం తేలుతుందా? అది చెప్పే ఆరోగ్య రహస్యాలు ఇవీ!

  2. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  3. అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్ పేరు మార్పు

    రైల్వే స్టేషన్

    ఫొటో సోర్స్, ANI

    అయోధ్య రైల్వే స్టేషన్ పేరును మార్చుతూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

    ఇకపై ఈ స్టేషన్ పేరును ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా వ్యవహరించనున్నారు.

    ఫైజాబాద్ (అయోధ్య) లోక్‌సభ సభ్యుడు లల్లూ సింగ్ ఈ సమాచారాన్ని తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు.

    ‘‘ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శనంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా నూతనంగా నిర్మితమైన గ్రాండ్ అయోధ్య రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధామ్ జంక్షన్‌గా మార్చారు’’ అని లల్లూ సింగ్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

    ‘‘అయోధ్యలోని సాధులోకం, ప్రజలు, భక్తులు తరపున ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని ఆయన రాశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఉత్తర రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ బుధవారం జారీచేసిన ఉత్తర్వుల్లో అయోధ్య ధామ్ జంక్షన్ కోడ్ ఏవై అనే కొనసాగుతుందని తెలిపారు.

    అయోధ్యలో అయోధ్య జంక్షన్, అయోధ్య కంటోన్మెంట్ అనే రెండు స్టేషన్లు ఉన్నాయి. అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్‌కు మాత్రమే పేరు మార్పు వర్తిస్తుంది.

    ఉత్తర్వు

    ఫొటో సోర్స్, X / PTI

  4. హనీ బ్యాడ్జర్: మూడు చిరుత పులులను ఎదిరించిన ఈ చిన్న జంతువుకు అన్ని శక్తియుక్తులు ఎక్కడివి?

  5. ఎంఫిల్ డిగ్రీలు చెల్లవు, అడ్మిషన్లు తీసుకోకండి: యూజీసీ

    యూజీసీ

    ఫొటో సోర్స్, ANI

    ఎం.ఫిల్ (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) డిగ్రీకి గుర్తింపు లేదని, ఆ కోర్సులో చేరొద్దని విద్యార్థులకు సూచించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).

    ఈ మేరకు యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి తెలిపినట్లు వార్తాసంస్థ పీటీఐ తెలిపింది.

    “యూజీసీ (మినిమం స్టాండర్ట్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ అవార్డింగ్ పీహెచ్‌డీ డిగ్రీ) రెగ్యులేషన్ 2022లోని రెగ్యులేషన్.14లో ఉన్నత విద్యాసంస్థలు ఎం.ఫిల్ కోర్సుకు అడ్మిషన్లు తీసుకోవద్దని స్పష్టంగా ఉంది” అని మనీష్ జోషి చెప్పారు.

    ‘‘స్పష్టంగా చెప్పినప్పటికీ కొన్ని యూనివర్సిటీలు అడ్మిషన్లు ఆహ్వానిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎం.ఫిల్‌ను గుర్తింపు పొందిన డిగ్రీగా పరిగణించట్లేదని ఈ సందర్భంగా యూజీసీ స్పష్టం చేస్తోంది. ఇప్పటికే 2023-24 సంవత్సరానికి అడ్మిషన్లు తీసుకోవద్దని దేశంలోని అన్ని యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశాలు జారీ చేసింది’’ అని ఆయన తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఎం.ఫిల్ కోర్సు అంటే?

    దేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్ తరువాత నేరుగా పీహెచ్‌డీలో అడ్మిషన్లు అందిస్తుండగా, మరికొన్ని యూనివర్సిటీలు మాస్టర్స్ తరువాత ఎం.ఫిల్ డిగ్రీ, ఆ తరువాత పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

    ఎం.ఫిల్ కోర్సులో చేరిన వారిని పీహెచ్‌డీ కోర్సుకు సన్నద్ధం చేస్తారు.

    అయితే, పీహెచ్‌డీ అడ్మిషన్ పొందే విషయంలో తలెత్తిన అస్థిరతను తొలగించేందుకు ఎం.ఫిల్‌ కోర్సును ఆపివేస్తున్నట్లు యూజీసీ ప్రకటించింది.

  6. భారత్ నుంచి ప్రవహించే ‘సింధు’లో బంగారం తవ్వుతున్న పాకిస్తానీలు.. నదిలో పసిడి ఎలా దొరుకుతోంది?

  7. ‘ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్ (మసరాత్ అలమ్)’పై కేంద్రం నిషేధం

    అమిత్ షా

    ఫొటో సోర్స్, ANI

    ‘ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్ - మసరాత్ అలమ్ వర్గం(ఎంఎల్‌జేకే-ఎంఏ)’ను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎక్స్(ట్విటర్)‌లో తెలిపారు.

    ఈ సంస్థ, దీని సభ్యులు జమ్మూకశ్మీర్‌లో దేశ వ్యతిరేక చర్యలకు, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారని, అక్కడ ఇస్లామిక్ పాలన తెచ్చేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారని అమిత్ షా చెప్పారు.

    భారతదేశ ఐక్యతకు, సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించే ఎవరినైనా ఉపేక్షించబోమని, అలాంటివారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవనేది నరేంద్ర మోదీ ప్రభుత్వ సందేశమని ఆయన తెలిపారు.

  8. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంట్లో విషాదం, అమెరికాలొ మృతి చెందిన బంధువులు, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    ముమ్మిడివరం ఎమ్మెల్యే

    ఫొటో సోర్స్, UGC

    అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు మరణించారు.

    టెక్సాస్‌లో వారు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.

    ప్రమాదంలో ఎమ్మెల్యే సతీష్ బాబాయ్ నాగేశ్వరరావు (68), పిన్ని సీతామహాలక్ష్మి (65), వారి కుమార్తె నవీన మరో ఇద్దరు పిల్లలు మరణించారు.

    నాగేశ్వరరావు అల్లుడు లోకేష్ తీవ్రంగా గాయాలు పాలయ్యారు.

    అమలాపురానికి చెందిన నాగేశ్వరరావు తన అల్లుడు కూతురు అమెరికాలో ఉండటంతో రెండు నెలల క్రితం భార్యతో కలిసి వారి వద్దకు వెళ్లారు.

    స్థానికంగా ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తారు. కుటుంబంతో కలిసి అమెరికా వెళ్ళగా అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో వారు మృతి చెందడంతో అమలాపురంలోని కుటుంబ సభ్యులంతా విషాదంలో మునిగిపోయారు.

    నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు బంధువులు చెబుతున్నారు.

  9. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు: తెలంగాణలో ప్రభుత్వం మారడంతో కార్మిక సంఘాల నాయకత్వాలూ మారుతాయా?

  10. 'అసహజ శృంగారం' కోసం భార్య పై ఒత్తిడి, భర్తకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష...ఈ తీర్పుపై ఎందుకు చర్చ జరుగుతోంది?

  11. రాహుల్ గాంధీ: మణిపుర్- ముంబయికి భారత్ న్యాయ్ యాత్ర

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, Getty Images

    కాంగ్రెస్‌ నాయకుడు, లోక్‌సభ ఎంపీ రాహుల్‌ గాంధీ జనవరి 14 నుంచి మణిపుర్ నుంచి ముంబయి వరకు భారత్‌ న్యాయ యాత్రను చేపట్టనున్నారు.

    దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన 85 జిల్లాల గుండా జనవరి 14 నుంచి మార్చి 20 వరకు 6200 కి.మీ మేర ఈ యాత్ర సాగుతుంది.

    యాత్రలో భాగంగా కాలినడకతో పాటు బస్సులో రాహుల్ గాంధీ తిరుగుతారు.

    తూర్పు నుంచి పడమర వరకు రాహుల్ గాంధీ యాత్ర చేయాలని డిసెంబర్ 21న జరిగిన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయిచినట్లు విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు.

    ఈ యాత్రలో యువత, మహిళలు, సమాజంలో అట్టడుగున ఉన్న వారితో రాహుల్ గాంధీ సమావేశమవుతారు.

    మణిపుర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల మీదుగా యాత్ర జరుగుతుంది.

  12. మోహన్ సింగ్ ఒబెరాయ్ : 50 రూపాయల జీతగాడు ప్రపంచవ్యాప్తంగా 35 లగ్జరీ హోటళ్ళకు అధిపతి ఎలా అయ్యాడు?

  13. భారత్‌లో ఎంబసీ వద్ద పేలుడును ‘ఉగ్ర దాడి’గా అనుమానిస్తూ తమ పౌరుల్ని అలెర్ట్ చేసిన ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్

    ఫొటో సోర్స్, Getty Images

    భారతదేశంలోని తమ పౌరులకు ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి సూచనలు చేసింది.

    న్యూదిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం జరిగిన పేలుడు 'ఉగ్రదాడి' అయి ఉండొచ్చని కౌన్సిల్ అనుమానం వ్యక్తం చేసింది.

    న్యూదిల్లీలోని చాణక్యపురిలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

    ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి గై నిర్ మాట్లాడుతూ, “మంగళవారం సాయంత్రం 5:48 గంటలకు రాయబార కార్యాలయం దగ్గర్లో పేలుడు జరిగింది. దిల్లీ పోలీసులు, భద్రతా బృందాలు దీనిపై దర్యాప్తు చేస్తున్నాయి’’ అని అన్నారు.

    దీని తరువాత ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

    రద్దీగా ఉండే ప్రదేశాల (మాల్స్, మార్కెట్లు)తో పాటు విదేశీయులు, ఇజ్రాయెలీలు, యూదుల సందర్శన స్థలాలుగా భావించే ప్రదేశాలకు వెళ్లవద్దని భారత్‌లోని ఇజ్రాయెల్ పౌరులను కౌన్సిల్ హెచ్చరించింది.

    బహిరంగ ప్రదేశాల్లో (రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్బులు) అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

    ‘‘ఇజ్రాయెల్ చిహ్నాలను బహిరంగంగా చూపవద్దు. మీ గుర్తింపును బహిర్గతం చేయడానికి అనుమతించవద్దు. పెద్ద ఎత్తున జరిగే ఈవెంట్‌లకు వెళ్లవద్దు. మీ ప్రయాణ ప్రణాళికలను సోషల్ మీడియాలో పంచుకోవద్దు’’ అంటూ మార్గదర్శకాల్లో పేర్కొంది.

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్‌నుక్లిక్ చేయండి.