ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. ఆయన బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు సన్నిహితుడు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, ANI
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. ఆయన బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు సన్నిహితుడు. సంజయ్ ప్యానల్ మొత్తం గెలిచిందని, మెజారిటీ కూడా వచ్చిందని బ్రిజ్‌భూషణ్ అల్లుడు విశాల్ సింగ్ గురువారం తెలిపారు.
గెలిచిన అనంతరం పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడిన సంజయ్ సింగ్.. అబద్దంపై నిజం ఎప్పుడూ గెలుస్తుందని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సంజయ్ సింగ్ ఎన్నిక అనంతరం మీడియాతో మాట్లాడారు రెజ్లర్ సాక్షి మాలిక్. ఒకవేళ బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి డబ్ల్యూఎఫ్ఐలో ఉంటే రెజ్లింగ్ వదిలేస్తానని ఆమె తెలిపారు. మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు అని చెప్పి, ఏడుస్తూ బయటికి వెళ్లిపోయారు సాక్షి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘మేం కష్టమైన యుద్ధమే చేశాం, ఆడపిల్లల కోసమే పోరాడుతున్నాం'' అని ఎన్నికల్లో ఓడిపోయిన అనితా షెరాన్ అన్నారు.
“మేం మధ్యతరగతి నుంచి వచ్చాం, వారి మూలాలు బలంగా ఉన్నాయి, ఫెడరేషన్ మార్పును అంగీకరించలేదు, రెజ్లర్లు పోరాడుతూనే ఉన్నారు, ఇక వారి ఫిర్యాదుపై ఏమీ చేయరు, మేం మౌనంగా ఉండలేం. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాం" అని తెలిపారు.
కొత్త ప్యానెల్ ప్రాధాన్యం గురించి విశాల్ సింగ్‌ను అడిగినప్పుడు.. "గత కొన్ని రోజులుగా రెజ్లింగ్‌కు ఎలాంటి కష్టాలు వచ్చినా, ఆట సజావుగా జరిగిందని కచ్చితంగా చెప్పొచ్చు. కొన్ని విషయాల కారణంగా ఆటగాళ్లు ఆశించినంతగా రాణించలేకపోయారు. క్రీడాకారులను మెరిట్ ఆధారంగా కాకుండా ఇతర కారణాలతో తీసుకుంటే, ఉత్తమ ఆటగాళ్లు నష్టపోతారు" అని అన్నారు.

ఫొటో సోర్స్, STRA MAA/BIGGBOSS/UGC
బిగ్‌బాస్-7 విజేత ప్రకటన తరువాత హైదరాబాద్‌లో జరిగిన ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి.
మొదటి రోజు ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బుధవారం పల్లవి ప్రశాంత్, ఆయన సోదరుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.
తాజాగా మరో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో నలుగురు మైనర్లు ఉన్నారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచనున్నారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 20కి చేరింది.
ఈ రోజు ఉదయం పల్లవి ప్రశాంత్‌ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
నిందితులపై ఐపీసీ సెక్షన్లతో పాటూ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కేసులు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, ANUMULA REVANTH REDDY/FB
సాగు నీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గురువారం ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
1956-2014, 2014-2023 మధ్య నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల వారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలను అధికారుల ద్వారా సీఎం తెలుసుకున్నారు.
ప్రతీ ప్రాజెక్టుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రజలకు తెలిసేలా చూడాలన్నారు.
ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దని ఒక వేళ అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
ప్రభుత్వంలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనన్న ఉద్దేశంతో ప్రతీ అంశాన్ని ప్రజలకు విడమరచి చెబుతున్నామన్నారు.
రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, రఘునందన్ రావు, శేషాద్రి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ ( గతంలో ట్విటర్) సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది.
గురువారం ఉదయం 11 గంటల నుంచి ట్విటర్ పనిచేయడం లేదు.
ట్విటర్ యాప్‌లో ట్వీట్లకు బదులుగా ‘‘మీ టైమ్‌లైన్‌కు స్వాగతం’’ అనే సందేశం కనిపిస్తోంది.
ఈ సాంకేతిక లోపానికి కారణం ఏంటో ఇంకా తెలియదు.
ట్విటర్ పనిచేయడం లేదంటూ వేల మంది యూజర్లు రిపోర్ట్ చేసినట్లు డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ పేర్కొంది.


ఫొటో సోర్స్, Getty Images
అమెరికా గడ్డపై సిక్కు నాయకుడు గురుపట్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసు గురించి భారత్‌ను అమెరికా హెచ్చరించిన తర్వాత కెనడా పట్ల భారత్ స్వరం మారిపోయిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు.
కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌తో బుధవారం ట్రూడో మాట్లాడుతూ, "ఇలా ముందుకు వెళ్లలేమని భారత్‌కు అర్థం అవుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే దీనిపై వారికి అవగాహన కలగడం మొదలైంది. ఈ విషయంలో వారు గతంలో ఇంత ఓపెన్‌గా లేరు. ఇప్పుడు వారు చాలా ఓపెన్‌గా కనిపిస్తున్నారు’’ అని ట్రూడో అన్నారు.
అమెరికా అభియోగాలు మోపిన తర్వాత, ఇప్పుడు భారత ప్రభుత్వం వినయపూర్వకమైన వైఖరిని అవలంబించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
నాలుగు ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు జలుబు నిరోధక మందుల కాంబినేషన్‌ను వాడటాన్ని భారత ఔషధ నియంత్రణ సంస్థ 'సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ)' నిషేధించింది.
ఫిక్స్‌డ్-డ్రగ్ కాంబినేషన్‌లను (ఎఫ్‌డీసీ) ఉపయోగిస్తున్నప్పుడు డ్రగ్ కంపెనీలు ఔషధాల లేబుల్‌పై "4ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఎఫ్‌డీసీలను వాడకూడదు’’ అని రాయాలని సెంట్రల్ సీడీఎస్‌సీఓ నిర్ణయించింది.
చాలా దేశాల్లో కొన్ని నెలల క్రితం దగ్గు సిరప్ తాగడం వల్ల 100 మందికి పైగా పిల్లలు మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సీడీఎస్‌సీఓ ఉత్తర్వుల ప్రకారం, ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఫిక్స్‌డ్-డ్రగ్ కాంబినేషన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు హెచ్చరికతో కూడిన లేబుల్ అమర్చాల్సి ఉంటుంది.
ఫిక్స్‌డ్ డ్రగ్ కాంబినేషన్‌లో క్లోర్‌ఫెనిరమైన్ మెలేట్, ఫినైల్‌ఫ్రైన్ ఉంటాయి.జలుబు తగ్గడానికి ఇచ్చే సిరప్ లేదా మాత్రలలో వీటిని వాడతారు.
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా అయిదేళ్ల లోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదని డబ్ల్యూహెచ్‌వో సిఫార్సులు ఉన్నాయి.

ఫొటో సోర్స్, UGC
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద గోదావరిలో పడి ఓ యువతిమరణించింది. పెళ్లయిన ఐదు రోజుల నాడే ఈ ఘటన జరగడంతో విషాదం అలముకుంది.
ఉండ్రాజవరం మండలానికి చెందిన కే శివరామకృష్ణ తో కోరాడ సత్యవాణి(19) వివాహం డిసెంబర్ 15న జరిగింది.20వ తేదీ రాత్రి ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలో వాగ్వాదం జరిగి, గోదావరిలో దూకి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.నవ దంపతులిద్దరూ గోదావరిలో దూకగా, యువకుడుని స్థానికులు రక్షించారు.
తణుకు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు.తమ కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని, వరుడు శివరామకృష్ణ పై అనుమానం ఉందంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పైక్లిక్ చేయండి.