ఉత్తర గాజాలో భీకర దాడులు

గాజా స్ట్రిప్‌లో తమ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడులకు సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేసింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. ఉత్తర గాజాలో భీకర దాడులు

    గాజా స్ట్రిప్‌లో దాడులు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, గాజా స్ట్రిప్‌లో దాడులు

    గాజా స్ట్రిప్‌లో తమ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడులకు సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేసింది.

    హమాస్‌ లక్ష్యంగా 4,300 వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.

    పెద్ద పెద్ద సొరంగాలు, హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

    హమాస్‌కు చెందిన 3,000 కేంద్రాలపై దాడులు చేశామని పేర్కొంది.

    గ్రౌండ్ ఆపరేషన్‌లో భాగంగా గాజా నగరంలోని ఆస్పత్రులకు సమీపంలో కూడా తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి.

    ఇజ్రాయెల్ దాడులు

    ఫొటో సోర్స్, IDF

    ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ దాడులు

    అల్-షిఫా ఆస్పత్రి వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

    ఆస్పత్రి బయట బాంబు దాడులు, కాల్పుల మోతతో.. ఇక్కడ ముందు కంటే పరిస్థితి దారుణంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ చెప్పారు.

    అల్-షిఫా ఆస్పత్రి కార్యకలాపాలు నిర్వహించలేపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

    తాను గాజాను విడిచిపెట్టే సమయానికి అల్-షిఫా ఆస్పత్రిలో కరెంట్, నీరు సరిపడినంత లేకపోవడంతో వైద్య సేవలు నిలిపివేసే దశకు చేరుకుందని బ్రిటీష్‌ డాక్టర్ అబ్దుల్ ఖాదీర్ హమ్మద్ తెలిపారు.

    వైమానిక దాడులతో గాజాలో కమ్ముకున్న పొగ

    ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

    ఫొటో క్యాప్షన్, వైమానిక దాడులతో గాజాలో కమ్ముకున్న పొగ
    అల్-షిఫా ఆస్పత్రి ప్రాంగణం

    ఫొటో సోర్స్, AFP

    ఫొటో క్యాప్షన్, అల్-షిఫా ఆస్పత్రి ప్రాంగణం

    కళ్ల ముందే రోగులు చనిపోతున్నారని, ఏం చేయలేని పరిస్థితుల్లో వైద్యులు ఉన్నారని ఖాదీర్ హమ్మద్ చెప్పారు.

    పిల్లల్ని, పరిస్థితి విషమంగా ఉన్న రోగులను ఆస్పత్రి నుంచి బయటికి తీసుకురావడం చాలా పెద్ద పని అని, ఒకవేళ సాధ్యమైనా, గాజాలో ఏ ఆస్పత్రిలో కూడా రోగులకు ఇంటెన్షిల్ కేర్ సదుపాయాలు అందుబాటులో లేవని చెప్పారు.

    అల్-షిఫా ఆస్పత్రిలో ప్రస్తుతం రోగులు, వైద్య సిబ్బంది, నిరాశ్రయులైన వారు కలిపి 2 వేల మందికి పైగా ఉన్నారు.

    ఇంటెన్షివ్ కేర్ అవసరమయ్యే 36 మంది నవజాత శిశువులు చనిపోయే ప్రమాదముందని అల్-షిఫా ఆస్పత్రి వైద్యులు భయపడుతున్నారు.

  3. ఇండి గ్రెగోరి : ఫలించని న్యాయపోరాటం, లైఫ్ సపోర్ట్ ఆపివేయడంతో కన్నుమూసిన చిన్నారి

  4. హైదరాబాద్: నాంపల్లి గోదాంలో అగ్ని ప్రమాదం, తొమ్మిది మంది మృతి

  5. సర్కస్‌ నుంచి తప్పించుకుని వీధుల్లో పరుగులు పెట్టిన సింహం

    సర్కస్ నుంచి తప్పించుకున్న సింహం

    ఫొటో సోర్స్, @Michelegalvani

    ఓ సింహం సర్కస్ నుంచి తప్పించుకుంది. పట్టణ వీధుల్లో పరుగులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

    ఇటలీలోని లడిస్పోలీ పట్టణంలో ఈ ఘటన జరిగింది.

    కింబా అనే ఈ సింహం వీధుల్లో తిరుగుతూ కనిపించింది. దీంతో పట్టణంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాత్రిపూట ఈ సింహం కోసం గాలించడం చాలా కష్టమైంది.

    గాయపడి, కుంటుతూనే ఈ సింహం చాలా సార్లు తప్పించుకోగలిగింది. దాదాపు ఏడు గంటలు శ్రమించి అధికారులు దానిని పట్టుకుని, మత్తు మందు ఇవ్వగలిగారు. తర్వాత దానిని మళ్లీ సర్కస్‌లోని బోనులో బంధించారు.

    ఇన్ని రోజులూ మనుషులతో కలిసి ఉన్నది కాబట్టి, ఈ సింహం ఎవరికీ హాని కలిగించదని దాని సర్కస్ నిర్వాహకులు చెప్పారు.

    వీడియో క్యాప్షన్, Escaped circus lion roams around Italian town before capture
  6. మొక్కలు నాటేందుకు పబ్లిక్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం

    కెన్యా ప్రజలు
    ఫొటో క్యాప్షన్, మొక్కలు నాటుతున్న కెన్యా పౌరులు

    కెన్యాలో 10 కోట్ల మొక్కలను నాటేందుకు ఆ దేశ ప్రభుత్వం ప్రత్యేక సెలవును మంజూరు చేసింది.

    వచ్చే పదేళ్లలో 1,500 కోట్ల మొక్కలను నాటాలని కెన్యా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

    ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేక సెలవును ఇచ్చినట్లు ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి సోయిపాన్ తుయా చెప్పారు.

    10 కోట్ల మొక్కలను పెంచేందుకు కెన్యాలో ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలను నాటాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

    ప్రభుత్వ నర్సరీల్లో 15 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అటవీ శాఖ పరిధిలోని భూముల్లో నాటేందుకు ప్రభుత్వం మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తోంది.

    అలాగే తమ సొంత భూమిలో కనీసం రెండు మొక్కలను నాటేలా కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

    కెన్యాలోని తూర్పు ప్రాంతమైన మకునిలో అధ్యక్షుడు విలియం రుతో దగ్గరుండి మొక్కలు నాటే ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా.. దేశంలో మిగిలిన ప్రాంతాల్లో ఈ మొక్కలు నాటే ప్రక్రియను చేపట్టేందుకు గవర్నర్లతో పాటు కేబినెట్ మంత్రులను పంపారు.

    మొక్కలు నాటడాన్ని ‘జాజా మిటి’ అనే ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఏ జాతి మొక్కలను నాటుతున్నారు? దాని నెంబర్ ఎంత? ఏ రోజు నాటారు? వంటి వివరాలను ఈ యాప్‌లో నమోదు చేస్తారు.

  7. చికెన్‌గున్యా పనిపట్టే టీకా రెడీ, ఇది ఎవరు వేసుకోవచ్చంటే..

  8. పెళ్లి చేసుకుంటా కానీ పిల్లలొద్దు అంటూ 20 మంది అబ్బాయిలను తిరస్కరించిన 20 ఏళ్ల అమ్మాయి

  9. ఇండియా తొమ్మిది మందితో బౌలింగ్ ఎందుకు వేయించింది? ద్రవిడ్, రోహిత్ ప్లాన్ అదేనా?

  10. సముద్రంలో కూలిన అమెరికా ఆర్మీ హెలికాప్టర్, ఐదుగురు సైనికులు మృతి

    అమెరికా

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికాకు చెందిన ఆర్మీ హెలికాప్టర్ తూర్పు మధ్యధరా సముద్రంలో కుప్పకూలింది. ఘటనలో ఐదుగురు సైనికులు మృతిచెందినట్లు అమెరికా ప్రకటించింది.

    రోజువారీ సైనిక శిక్షణలో భాగంగా ఇంధనం నింపుకునే క్రమంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని పేర్కొంది.

    విమానం ఎక్కడి నుంచి ఎగురుతోంది, నిర్దిష్టంగా ఎక్కడ కూలిపోయిందనే వివరాలను వెల్లడించలేదు.

    "ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాల కోసం, స్నేహితుల కోసం ప్రార్థిస్తున్నాం" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎక్స్ (ట్విటర్)లో తెలిపారు.

    ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదం చెలరేగినప్పటి నుంచి అమెరికా ఈ ప్రాంతంలో తన కార్యకలాపాలను పెంచింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి