లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, ఇది ఎంత కాలం పాటు అమలులో ఉంటుందో రాబోయే రోజుల్లో ఐసీసీ నిర్ణయిస్తుందని తెలిపింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
ఐసీసీలో శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బోర్డు ప్రకటించింది.
శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఐసీసీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
సభ్యురాలిగా శ్రీలంక క్రికెట్ తన బాధ్యతలను తీవ్ర ఉల్లంఘనకు పాల్పడిందని ఐసీసీ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
శ్రీలంక క్రికెట్ కనీసం తన బాధ్యతలను తాను నిర్వహించుకోలేకపోతోందని, ప్రభుత్వ జోక్యం లేకుండా శ్రీలంక క్రికెట్ నియంత్రణ, అడ్మినిస్ట్రేషన్ వంటి బాధ్యతలను నిర్వర్తించలేకపోతుందని ఐసీసీ బోర్డు చెప్పింది.
ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, ఇది ఎంత కాలం పాటు అమలులో ఉంటుందో రాబోయే రోజుల్లో ఐసీసీ నిర్ణయిస్తుందని తెలిపింది.
జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తామని కామారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయ భేరి యాత్రలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు.
ఈ సందర్భంగా బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది.
కొత్త స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌ను 23 శాతం నుంచి 42 శాతం పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే ప్రతి మండలానికి బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
గీత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రస్తుతమున్న 50 ఏళ్ల వృద్ధాప్య పింఛను అర్హత వయసునే మిగతా అన్ని చేతి వృత్తుల వారికి వర్తిస్తామని బీసీ డిక్లరేషన్‌లో చెప్పారు.
కేసీఆర్ అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని, కానీ అవినీతి సర్కారును ప్రజలు ఓడిస్తారని తనకు నమ్మకం ఉందన్నారు సిద్ధరామయ్య.
బీఆర్ఎస్ అవినీతి పాలనను అంతం చేయడానికి నవంబర్ 30 కోసం ప్రజలు కాచుకుని కూర్చుని ఉన్నారని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 100 సార్లు తెలంగాణకు వచ్చిపోయిన కూడా బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ప్రధాని సుమారు 48 సార్లు పర్యటించినా, ఆయన సభలు నిర్వహించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలుపొందిందని తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలను ప్రకటించిన తర్వాత, వీటిని అమలు అమలు చేస్తే కర్ణాటక రాష్ట్రం ఆర్థికంగా దివాలా అవుతుందని ప్రధాని మోదీ, కేసీఆర్ విమర్శించారని...కానీ, కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే 4 గ్యారెంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు.
ఐదో హామీ యువనిధి కూడా జనవరి నెలలో అమలు చేస్తామని సిద్ధరామయ్య తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ బీ టీమ్ అని విమర్శించారు.
సరిహద్దుల వెంబడి నేరాలను ఎదుర్కొనేందుకు ఉత్తర బెంగాల్‌లోని బీఎస్‌ఎఫ్ దళం ప్రత్యేక నైట్ విజన్ డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నాయి.
ఈ క్రమంలో భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రాత్రి సమయంలో స్మగ్లర్లు అక్రమంగా పశువులను తరలిస్తున్నారనే సమాచారం అందింది.
దీంతో నైట్ విజన్ డ్రోన్ కెమెరాల సాయంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మూడు పశువులను రక్షించామని అధికారులు చెప్పారు.
ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను బీఎస్ఎఫ్ విడుదల చేసింది.
'విమానంలో బాంబు బెదిరింపు' వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తామని కెనడా ప్రకటించింది.
''విమానయానానికి ఎలాంటి ముప్పు వచ్చినా మా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఇటీవల ఆన్‌లైన్‌లో వచ్చిన బెదిరింపులపై మా భద్రతా సంస్థలతో విచారణ చేయిస్తున్నాం'' అని కెనడా రవాణా శాఖ మంత్రి పాబ్లో రోడ్రిగ్జ్ ఒట్టావా ట్విటర్(ఎక్స్)లో తెలిపారు.
నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తానని ఖలిస్థాన్ అనుకూల నేత గురుపట్వంత్ సింగ్ పన్నూ ఒక వీడియోను ఈనెల 4న విడుదల చేశారు.
దీనిపై ఫెడరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కెనడా ప్రకటించిందని వార్తాసంస్థ ఎఫ్‌పీ తెలిపింది.
వీడియోపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. దేశంలో ఇటువంటి ఉగ్ర మూకలకు చోటు కల్పించకుండా విదేశీ ప్రభుత్వాలపై ఇండియా ఒత్తిడిని కొనసాగిస్తుందని ప్రకటించింది.
ప్రజలు ఉత్తర గాజాను విడిచి దక్షిణానికి వెళ్లేందుకు వీలుగా యుద్ధానికి రోజు 4 గంటలు విరామం ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా తెలిపింది.
ఈ విరామం సరైన దిశలో పడిన ముందడుగు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు.
''పౌరులను సురక్షితంగా ఉంచడానికి, బందీలను విడిపించడానికి, గాజాలోకి ఆహారం, నీరు, మెడిసిన్స్ సరఫరా పెంచేందుకు వీలుగా యుద్ధానికి విరామం ఇవ్వాలని కొన్ని వారాలుగా ఇజ్రాయెల్ నాయకులతో మాట్లాడుతున్నాను'' అని ట్విటర్ (ఎక్స్) లో బైడెన్ తెలిపారు.
విరామ వ్యవధిని పొడిగించేందుకు ఇజ్రాయెల్‌తో చర్చలు కొనసాగిస్తామని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ బీబీసీతో చెప్పారు.
గాజాలో హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను సురక్షితంగా విడుదల చేసేందుకు కూడా మరింత విరామం అవసరమని అమెరికా చెబుతోంది.
ఇజ్రాయెల్ దళాలు గాజాలో వైమానిక, భూతల దాడులు చేస్తున్నాయి. గురువారం హమాస్‌కు చెందిన 130 సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి