You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

టిక్‌టాక్‌కు రూ.3075 కోట్ల జరిమానా విధించిన యూరోపియన్ యూనియన్

యూరోపియన్ యూనియన్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు టిక్‌టాక్ తెలిపింది. ఈ విషయంలో వస్తున్న ఆరోపణలతో తమకు సంబంధం లేదని వాదించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. X (ట్విటర్) ఈ దేశ చట్టాలను చిన్నచూపు చూస్తోందని అఫిడవిట్‌లో ఆరోపించిన కేంద్రం

  3. మార్క్ ఆంటోనీ రివ్యూ: విశాల్ చేయించిన టైమ్ ట్రావెల్ ఆకట్టుకుందా...

  4. ఆసియ కప్: భారత్‌కు 266 పరుగుల విజయలక్ష్యాన్ని ఇచ్చిన బంగ్లాదేశ్

    ఆసియా కప్‌లో భాగంగా భారత్ బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ముందు బంగ్లాదేశ్‌ 266 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.

    బంగ్లా జట్టులో షకీబ్ అల్ హసన్ 85 బంతుల్లో 80 పరుగులు, తాహిద్ హృదయ్ 54 పరుగులు, నసుమ్ అహ్మద్ 44 పరుగులు చేయడంతో బంగ్లా టీమ్ భారత్‌కు మంచి లక్ష్యాన్ని ఇవ్వగలిగింది.

    టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు ఆరంభంలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసింది. భారత జట్టులో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, మహమ్మద్ షమీ 2 రెండు వికెట్లు తీశారు.

    ఈ వార్త ప్రచురించే సమయానికి భారత జట్టు 38 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 98 పరుగులతో, అక్సర్ పటేల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

  5. టిక్‌టాక్‌కు రూ.3075 కోట్ల జరిమానా విధించిన యూరోపియన్ యూనియన్

    సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌‌కు యూరోపియన్ యూనియన్ సుమారు 3075 కోట్ల రూపాయల జరిమానా విధించింది. పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత డేటాను సరిగ్గా మేనేజ్‌ చేయడం లేదన్న కారణంతో టిక్‌టాక్‌కు ఈ జరిమానా పడింది.

    టిక్‌టాక్‌లోని పిల్లల అకౌంట్లకు సంబంధించిన సమాచారం సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తోందని ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ తన పరిశోధనలో కనుగొంది.

    చైనీస్ సంస్థ యాజమాన్యంలోని ఈ ప్లాట్‌ఫామ్‌పై డేటా ప్రొటెక్షన్ కమిషన్ పలు ఆరోపణలు చేసింది. 13 ఏళ్లలోపు పిల్లలు కూడా ఇందులో సులభంగా అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారని పేర్కొంది.

    అయితే, యూరోపియన్ యూనియన్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు టిక్‌టాక్ తెలిపింది. ఈ విషయంలో వస్తున్న ఆరోపణలతో తమకు సంబంధం లేదని వాదించింది.

  6. ఆసియా కప్ 2023: ఫైనల్లో భారత్ గెలుస్తుందా.. శ్రీలంక స్పిన్ అటాక్‌ను చిత్తు చేస్తుందా?

  7. టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు: నటుడు నవదీప్‌ పరారీలో ఉన్నారా... ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు?

  8. కపిల్ దేవ్ 175: వరల్డ్ కప్ గెలవగలమనే నమ్మకాన్ని భారతజట్టుకు ఇచ్చిన చరిత్రాత్మక ఇన్నింగ్స్

  9. మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా?

    భారత ప్రభుత్వం దేశంలోని స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఒక టెక్ట్స్ మెసేజ్‌ను పంపించి తన ‘ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌’ను పరీక్షించింది.

    కొందరు యూజర్ల ఫోన్లకు పెద్ద సౌండ్‌తో ‘ఎమర్జెన్సీ అలర్ట్: సివియర్ ఫ్లాష్’ అనే మెసేజ్‌ వచ్చింది.

    ‘‘కేంద్ర ప్రభుత్వానికి చెందిన టెలికమ్యూనికేషన్ విభాగ సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా ఈ శాంపిల్ టెస్టింగ్ మెసేజ్‌ను పంపుతున్నాం. మీ నుంచి ఎలాంటి అవసరం లేకపోతే, దయచేసి దీన్ని ఇగ్నోర్ చేయండి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ద్వారా అమలు చేస్తోన్న ఈ ఎమర్జెన్సీ సిస్టమ్‌ పరీక్షను దేశవ్యాప్తంగా చేపట్టాం. ప్రజా భద్రత కోసం, అత్యవసర సమయాల్లో సమయానుకనుగుణంగా అలర్ట్‌లు ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ పరీక్షను నిర్వహించాం. ’’ అనే ఫ్లాష్ మెసేజ్‌ యూజర్లకు కనిపించింది.

    శుక్రవారం మధ్యాహ్నం 12.15 నుంచి 12.30 మధ్య చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ మెసేజ్ వచ్చింది.

    మొదట ఇంగ్లిష్‌లో ఆ తరువాత కొద్దిసేపటికి హిందీలోనూ మెసేజ్‌లు వచ్చాయి.

    మొబైల్ ఆపరేటర్లు, సెల్ బ్రాడ్‌కాస్ట్ సిస్టమ్‌లకు చెందిన ఎమర్జెన్సీ వార్నింగ్ బ్రాడ్‌కాస్ట్ సామర్థ్యాలను అంచనావేసేందుకు, సమర్థవంతంగా పనిచేస్తున్నాయో లేదో చూసేందుకు వివిధ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఇలాంటి పరీక్షలను నిర్వహిస్తూ ఉంటామని టెలికమ్యూనికేషన్ విభాగపు సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ తెలిపింది.

    కాగా ఇది కొన్ని రాష్ట్రాలలో యూజర్లకు మాత్రమే వచ్చినట్లు చెప్తున్నారు.

    ఇంతకుముందు ఆగస్ట్ 17న కొన్ని రాష్ట్రాలలో యూజర్లకు ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయి.

  10. నిపా వైరస్: కేరళ రాష్ట్రానికి యాంటీబాడీలు, మొబైల్ ల్యాబ్‌ను పంపిన ఐసీఎంఆర్

    కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్రానికి యాంటీబాడీలను అందించింది ఐసీఎంఆర్.

    సేకరించిన శాంపిళ్లను పరీక్షించేందుకు మొబైల్ ల్యాబ్‌ను కూడా ఆ రాష్ట్రానికి పంపించింది.

    న్యూస్ ఏజెన్సీ పీటీఐ సమాచారం ప్రకారం, గురువారం కోజికోడ్‌లో ఐసీఎంఆర్ మోనోక్లోనల్ యాంటీబాడీలను డెలివరీ చేసింది.

    ఈ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేసేందుకు ప్రభుత్వం వద్దనున్న ఒకే ఒక్క ఆప్షన్ యాంటీవైరల్స్. కానీ, నిపా వైరస్ నుంచి బయట పడేసేందుకు ఇవెంత సహకరిస్తాయన్నది మాత్రం ఇప్పటి వరకు క్లినికల్‌గా నిరూపితం కాలేదు.

    పుణేకు చెందిన ఐసీఎంఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ) కోజికోఢ్‌లో నమోదైన ఐదు కేసుల వైరస్ శాంపిళ్లను పరీక్షించేందుకు మొబైల్ బీఎస్ఎల్-3(బయోసేఫ్టీ లెవల్-3) ల్యాబ్‌ను పంపినట్లు చెప్పింది.

    కోజికోఢ్‌లో నమోదైన ఐదు కేసులలో ఇద్దరు మరణించారు. మిగిలిన ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. కోజికోడ్ జిల్లాలో 9 గ్రామ పంచాయతీల్లో ఆంక్షలు విధించారు. శనివారం వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

  11. విజయనగరం నుంచి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం జగన్

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాలను శుక్రవారం ప్రారంభించారు.

    రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నెలకొల్పిన మరో నాలుగు మెడికల్ కాలేజీలను ఆయన అక్కడి నుంచే వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

    అనంతరం ప్రభుత్వ వైద్యకళాశాలలో ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, వివిధ విభాగాలకు చెందిన ల్యాబ్‌లను పరిశీలించారు.

  12. ఆసియా కప్: పాకిస్తాన్‌పై శ్రీలంక విజయం, ఫైనల్‌లో భారత్‌తో పోరు

    ఆసియా కప్ క్రికెట్ టోర్నీ సూపర్-4 మ్యాచ్‌లలో ఆతిథ్య శ్రీలంక జట్టు పాకిస్తాన్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

    దీంతో శ్రీలంక జట్టు భారత్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

    తొలుత పాకిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ విధానం ప్రకారం శ్రీలంక ఇన్నింగ్స్‌ను 42 ఓవర్లకు కుదించి 252 పరుగుల లక్ష్యం ఇచ్చారు.

    ధాటిగా ఆడిని శ్రీలంక 8 వికెట్లు నష్టపోయి 42 ఓవర్ చివరి బంతికి లక్ష్యం చేరుకుంది.

    శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్ 91 పరుగులు చేశాడు. సమర విక్రమ 48, అసలంక 49 పరుగులు చేశారు.

    పాకిస్తాన్ బౌలర్లలో ఇఫ్తికార్ అహ్మద్ 3 వికెట్లు, షహీన్ అఫ్రిదీ 2 వికెట్లు తీశారు. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా, ప్రమోద్ మదుశాన్ రనౌట్ అయ్యారు.

    తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ షఫీక్ 52 పరుగులు చేయగా రిజ్వాన్ 86, ఇఫ్తికార్ అ హ్మద్ 47 పరుగులు చేశారు. ఇఫ్తికార్ బంతితో, బ్యాట్‌తోనూ రాణించినప్పటికీ జట్టుకు విజయం అందించలేకపోయాడు.

    శ్రీలంక బౌలర్లలో పతిరన 3, ప్రమోద్ మదుశాన్ 2 వికెట్లు తీశారు.

    సెప్టెంబర్ 17న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారత్‌తో తలపడనుంది.

  13. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్స్‌ను నిరంతరం బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీలో చూడండి.